Rhea Chakraborty Judicial custody Extends: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. దీంతో గతనెల 9 నుంచి నుంచి జైలులోనే ఉన్న రియా చక్రవర్తితోపాటు పలువురి జ్యుడిషియల్ కస్టడిని మరో 14 రోజులపాటు పెంచుతూ ముంబై ప్రత్యేక కోర్టు మంగళవారం వెల్లడించింది. అంతకుముందు విధించిన 14రోజుల కస్టడీ సోమవారంతో ముగియడంతో ఎన్‌సీబీ (NCB) అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని మంగళవారం ఎన్‌డీపీఎస్ కోర్టులో హాజరుపరింది. ఈ మేరకు న్యాయస్థానం మరో 14రోజులపాటు ఈనెల 20 వరకు వారి జ్యుడిషియల్ కస్టడి (judicial custody) ని పెంచుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అంతకుముందు విచారణలో.. తాను డ్రగ్స్ తీసుకోలేదని, సుశాంత్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి ఇచ్చేదాన్నని రియా చక్రవర్తి ఎన్‌సీబీ అధికారులకు వెల్లడించిన విషయం తెలిసిందే. Also read: Sushant death case: సుశాంత్‌ది హత్య కాదు: ఎయిమ్స్ బృందం


కాగా, జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ మరణం కేసును ముందుగా ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. సుశాంత్ అభిమానులు, కుటుంబసభ్యులు, బీహార్ ప్రభుత్వం వినతితో ఈ కేసు సీబీఐ (CBI) కి చేతికి వెళ్లింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సైతం దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో కేసులో డ్రగ్స్ వ్యహారం బయటపడటంతో నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. దీంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అయితే ఈ కేసులో రియా చక్రవర్తితో పాటు, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, డ్రగ్స్ ముఠా, డ్రగ్స్ సరఫరాదారులతోపాటు సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న 19 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. దీంతోపాటు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్న టాప్ హీరోయిన్లను సైతం విచారించింది.  Also read: Prabhas: మీ ప్రేమకు.. థ్యాంకూ డార్లింగ్స్