Kantara Telugu Movie Day 1 Collections : కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారా సినిమాను ప్రస్తుతం అన్ని భాషల్లో డబ్ చేసిన వదిలేస్తున్నారు. శనివారం నాడు ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ భారీ ఎత్తున రిలీజ్ చేశారు. దాదాపు మూడొందల థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో అని అంతా భావించినట్టున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఒక్క రోజులోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసింది. మొదటి రోజే నాలుగు కోట్ల గ్రాస్, రెండు కోట్ల షేర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దెబ్బకు సినిమా బ్రేక్ ఈవెన్ టచ్ చేసింది. ఇలా ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్ రావడం, ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇంత వరకు జరగలేదు. దీంతో కాంతారా స్టామినా ఏంటో అందరికీ అర్థమవుతోంది.


కాంతారా సినిమా మున్ముందు ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయబోతోంది. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. కన్నడలో ఆల్రెడీ వంద కోట్లు కొల్లగొట్టేసింది కాంతారా. ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళ మార్కెట్ మీద కన్నేసింది. అయితే ఈ మూడు భాషల్లోనూ కాంతారా చిత్రానికి మంచి టాక్ వచ్చింది.


దీంతో కాంతారా కలెక్షన్లు మరింతగా పెరిగేట్టున్నాయి. తెలుగులో ఆదివారం నుంచి వచ్చే కలెక్షన్లన్నీ కూడా లాభాలే అన్నమాట. అంటే కనీసం ఇంకో వారం రోజులు ఈ సినిమాను హడావిడి ఉంటుంది. వచ్చే శుక్రవారం వరకు ఈ సినిమాకు ఎదురుండదు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ సైలెంట్ అయిపోయింది. కాంతారా అరుపులకు గాడ్ ఫాదర్ నోర్మూసుకున్నట్టు అయింది. మొత్తానికి అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమాతో భారీ లాభాలను అర్జించేలా ఉన్నాడు.


Also Read : Chiranjeevi Godfather : చిరంజీవిని దెబ్బ కొట్టేసిన అల్లు అరవింద్.. గాడ్ ఫాదర్ పని ఇక ఖతం


Also Read : Kantara Movie Budget : కాంతారాకు పెట్టింది ఎంత?.. వచ్చింది ఎంత?.. దెబ్బకు కేజీయఫ్ అవుట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook