Ritu Varma Swag: శ్రీ విష్ణు సినిమాలకు తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమా వస్తోంది అంటే తప్పకుండా వైవిధ్యమైన కథనంతో వస్తుంది అని నమ్ముతారు అందరూ. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు ఈ మధ్య తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా మూడు సినిమాలను ప్రకటించాడు. ఇందులో స్వాగ్ ఫస్ట్ లుక్ ఎంతో ఆదరణ తెచ్చుకుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వాగ్ చిన్న వీడియో గ్లిమ్స్ ఆ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ చేస్తుండగా ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ మరింత ఆకట్టుకుంటోంది. మొన్న శ్రీ విష్ణు ఫస్ట్ లుక్ చూసి అదరహో అన్న అభిమానులు ఇప్పుడు రీతు వర్మ ఫస్ట్ లుక్ చూసి మరింత ఫిదా అవుతున్నారు.


తెలుగు అమ్మాయి అయిన రీతు వర్మ ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలింతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఎన్టీఆర్ ‘బాద్‌షా’ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు నటించి సినిమా కెరీర్ ని స్టార్ట్ చెయ్యగా విజయ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయం అందుకుంది. శ్రీ విష్ణు లాగానే రీతు వర్మ కూడా మంచి కథలో ఉండే చిత్రాలనే ఎంచుకుంటూ ఉంటుంది. ఇక వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా నెలకొన్నాయి.


ఈరోజు రీతు వర్మ పుట్టినరోజు కాక ఆమె నటిస్తున్న సినిమా నిర్మాతలు విషెస్ తెలియజేస్తూ పోస్టులు వేస్తున్నారు. ఈ క్రమంలో ‘స్వాగ్’  సినిమా నిర్మాతలు ఆమె ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు.’రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రీతు వర్మ రాణి అవతారంలో ఉండే ఫోటోను షేర్ చేస్తూ ఈ సినిమా మేకర్ పోస్టు వేశారు.


 



ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే


Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter