RK Roja Counter To Nagababu: ఒకప్పుడు కలిసి జబర్దస్త్ ప్రోగ్రాం చేసిన నాగబాబు రోజా మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల ఆర్కే రోజా పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరో పక్క మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేనలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన తరువాత నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జనసేన సపోర్టర్స్ కు అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇటీవల రోజా ఒక ప్రాంతంలో వాటర్ ట్యాంక్ ప్రారంభిస్తూ ఫోజులిచ్చారు. దానికి నాగబాబు కౌంటర్ వేస్తూ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రారంభించిన రోజా అంటూ ఒక ట్వీట్ చేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ(మాయ) పార్టీ నాయకురాలు రోజా ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 06. 25 లక్షల ఎగరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగనీరు అందించినట్లు సమాచారం అంటూ ఎద్దేవా చేశారు. దానికి రోజా కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.


ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసమే ఎదురుచూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ లాగి తాగునీటికి ఇచ్చాము నాగబాబు అంటూ పేర్కొన్నారు. గాడిదకి ఏం తెలుసు గంధపువాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా, అదే ఆ గ్రామానికి వెళ్లి ఎటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం అంటూ ఆమె కూడా కౌంటర్ ఇస్తూనే కొన్ని వివరాలను కూడా షేర్ చేశారు. ఇక వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం ఆసక్తికరంగా మారిందని తెలుగు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు కలిసి షో చేసిన వీరిద్దరూ ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు కౌంటర్లు వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 


Also Read: Ananya Nagalla Bold: అనన్య నాగళ్లను ఇంత బోల్డ్ గా ఎప్పుడూ చూసి ఉండరు.. పైన ఏమీ లేకుండానే!


Also Read: Alia Bhatt Sister Pooja Bhatt : తెలుగు సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ అక్క.. ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook