RRR box office collection Day 3: ఆర్ఆర్ఆర్ మూవీ ఆదివారం నాటి కలెక్షన్స్ అదుర్స్
RRR box office collection Day 3: ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో హిట్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. మూడో రోజు ఆదివారం కావడంతో.. మొదటి రోజుకన్నా మెరుగైన కలెక్షన్లు రాబట్టిందని విశ్లేషకులు అంటున్నారు. మరు డే-3 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
RRR box office collection Day 3: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. జక్కన రాజమౌళి తీసిన.. 'ఆర్ఆర్ఆర్' మూవీ థియేటర్లలో మూడో రోజూ రికార్డులు సృష్టించింది. పైగా మూడో రోజు ఆదివారం కావడంతో సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆసక్తి చూపారు.
కొన్ని సినీ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంటర్లలో 'ఆర్ఆర్ఆర్' మూవీ మొదటి రోజు కంటే ఆదివారమే ఎక్కువ వసూళ్లు నమోదైనట్లు తెలిసిది.
సినీ విశ్లేషకులు రమేశ్ బాల ప్రకారం.. హిందీలో ఆదివారం ఒక్క రోజే ఆర్ఆర్ఆర్ మూవీ రూ.30 కోట్ల నెట్ రాబట్టినట్లు తెలిసింది.
ఉత్తర అమెరికాలో ఈ మూవీ మార్చి 23 నుంచి 27 మధ్య 11 మిలియన్ డాలర్లు (రూ.83 కోట్లు) వసులు చేసింది.
ఇక మార్చి 25 నుంచి 27 మధ్య.. అమెరికా, కెనడాల్లో హాలీవుడ్ సినిమాలు ది లాస్ట్ సిటీ 31 మిలియన్ డాలర్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 19 మిలియన్ డాలర్ల వసూళ్లతో ది బ్యాట్‌మ్యాన్ ఉండగా.. ఆర్ఆర్ఆర్ మూడో స్థానంలో నిలిచిందని రమేశ్ బాల ట్వీట్ చేశారు.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో (తెలుగు మినహా) ఆర్ఆర్ఆర్ భారీ వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు ఈ మూవీ చెన్నైలో రూ.1.23 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ గురించి..
ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. బ్రిటీష్ పాలనపై.. కల్పిత కథతో తీసిన మూవీ ఇది. ఈ మూవీని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో భారీ తరాగణం నటిచింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్గన్ సహా, సముద్రకని, శ్రియాలు కీలక పాత్రల్లో కనిపించారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Also read: Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి... ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook