RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!
RRR Collection in USA: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `ఆర్ఆర్ఆర్` మూవీ థియేటర్లలో రానే వచ్చేసింది. ప్రీమియర్ షోస్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. అమెరికాలో ప్రీమియర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు ట్రేడ్ విభాగం చెబుతోంది.
RRR Collection in USA: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచే థియేటర్లలో అభిమానుల కోలాహలం మొదలైంది. తమ అభిమాన హీరోలను కలిపి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బెన్ ఫిట్ షోస్ కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వేలకు వేల డబ్బును పెట్టి చాలా మంది సినిమాను చూశారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 100 కోట్లకు పైగా ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అమెరికాలో గురువారం (మార్చి 24) రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి.
ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా దాదాపుగా 3 మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చినట్లు అమెరికా డిస్ట్రిబ్యూటర్ సరిగమప ట్వీట్ చేసింది. కేవలం ప్రీమియర్స్ నుంచి 3 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన తొలి భారత చిత్రంగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది.
ఆర్ఆర్ఆర్ మూవీని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించగా.. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషించారు. ఆలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ తో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!
ALso Read: RRR review: ఆర్ఆర్ఆర్ ఓవర్సిస్ రివ్యూ వచ్చేసింది- మూవీ రికార్డులు సృష్టిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook