RRR : చెర్రీ, ఎన్టీఆర్‌లతో చాలా ప్రాబ్లమ్స్... జక్కన్న కంప్లైంట్‌కి ఊహించని ఝలక్...
Jr Ntr fun moment with Rajamouli: ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా జూ.ఎన్టీఆర్ రాజమౌళికి చిన్న ఝలక్ ఇచ్చారు. తమపై రాజమౌళి ప్రేక్షకులకు కంప్లైంట్స్ చేస్తుండటంతో ఒక్కసారిగా ఆయన్ను గిల్లేశారు. దీంతో రాజమౌళి సీటు నుంచి చెంగున లేచి నిలబడ్డారు.
Jr Ntr fun moment with Rajamouli: మేకింగ్ మాత్రమే కాదు మూవీ ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి (SS Rajamouli) స్పెషలిస్ట్ అనే చెప్పాలి. సినిమా తెరకెక్కించడానికి ఎంత కష్టపడుతారో... దాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు అంతే ఎఫర్ట్స్ పెడుతారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) ప్రమోషన్స్‌లో జక్కన్న అండ్ టీమ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరుల్లో ప్రెస్ మీట్స్ పెట్టి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలను అక్కడి మీడియా, అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించగా... రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సినిమా విశేషాలు చెబుతూనే చెర్రీ, ఎన్టీఆర్‌లపై కంప్లైట్స్ చేశారు రాజమౌళి. ఈ ఇద్దరి మూలంగా దాదాపు 25 రోజులు వృథా అయ్యాయని చెప్పారు. రాజమౌళి ఈ విషయం చెబుతున్న సమయంలో... పక్కనే ఉన్న ఎన్టీఆర్ (Jr NTR) ఆయన్ను వారించేందుకు ఆయన నడుముపై గిల్లాడు. వెంటనే రాజమౌళి సీట్లో నుంచి లేచి కాసేపు నిలబడి స్పీచ్ ఇచ్చారు.
'ఈ ఇద్దరి తో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే... సినిమాను 300 రోజులు షూట్ చేసి ఉంటే... వీళ్ల కారణంగా 25 రోజులు వేస్ట్ అయ్యాయి. ఇద్దరికీ 30 ఏళ్లకు పైగా వయసు వచ్చింది. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. వెనకాల ఇద్దరికీ లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నా మీకోసం చచ్చిపోతాం అనే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ సెట్‌లో మాత్రం... చరణ్ గిల్లుతున్నాడని ఎన్టీఆర్ కంప్లైంట్ చేస్తాడు... నేనా... నేనెప్పుడు గిల్లానని చరణ్ అమాయకంగా అంటాడు... 10, 15 నిమిషాలు ఇదే తంతు సాగుతుంది...' అని రాజమౌళి (SS Rajamouli) చెప్పుకొచ్చారు.
చెర్రీ, ఎన్టీఆర్‌లపై జక్కన్న కంప్లైంట్‌కి సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్, సాంగ్స్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు ఇప్పటివరకూ 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ఫిక్షన్ పాత్రలతో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా (RRR Movie).. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Tirumala:తిరుమల శ్రీవారికి రూ.3కోట్ల విలువ చేసే బంగారు కానుకలు-అజ్ఞాత భక్తుడి విరాళం