RRR Movie Glimpse: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలయ్యేందుకు (RRR Movie Release Date) సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను (RRR Movie Glimpse) సోమవారం (నవంబరు 1)  ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. 45 సెకన్ల నిడివితో రిలీజ్ అయిన ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సినిమా కోసం లోగోనే మార్చేసి..


'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం తమ లోగోనే మార్చేసింది ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్. తమ లోగోలోని చివరి 'ఆర్' స్థానంలో ఈ సినిమా పేరును చేర్చి.. పీవీ'ఆర్ఆర్ఆర్'గా నామకరణం చేసింది. దీనికి సంబంధించిన కార్యక్రమం శుక్రవారం (అక్టోబరు 29) ముంబయిలోని అంధేరీలో జరిగింది. ఈ కార్యకమంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, కార్తికేయ రాజమౌళి హాజరయ్యారు. డైరెక్టర్ రాజమౌళి ఈ లోగోను ఆవిష్కరించారు. 


అయితే ఓ సినిమా కోసం తమ సంస్థ పేరు మార్చుకోవడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ ట్రెండ్​ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశముంది. మన దేశంలోని పీవీఆర్​కు చెందిన 850కి పైగా స్క్రీన్లతో పాటు 70కి పైగా నగరాల్లో ఉన్న 170కి పైగా బిల్డింగ్​లపై PV'RRR' అనే పేరు (PVR News) దర్శనమివ్వనుందని ఆర్ఆర్​ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది.


భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్​ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. అల్లూరిగా రామ్​చరణ్, కొమురం భీమ్​గా ఎన్టీఆర్ (RRR Movie Cast) నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. రూ.450 కోట్లతో (RRR Movie Budget ) నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి (RRR Movie Release Date) రానుంది.


Also Read: Rajamouli Pawan Kalyan Movie: పవన్ కల్యాణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి  


Also Read: RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్‌ప్రైజ్‌.. మూవీ గ్లింప్స్ విడుదల తేదీ ప్రకటన  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook