RRR Day 1 Collections: ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామి- తొలి రోజు ఎంతంటే?
RRR Day 1 Collections: ఎన్నో సార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన `ఆర్ఆర్ఆర్` మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం.
RRR Day 1 Collections: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైంది.
1920ల కాలంలో భారత స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు ఎలాంటి పోరాటం చేశారు అనే కల్పిత కథ ఆధారంగా ఈ సినమా తెరకెక్కింది. ఒకే మూవీలో అటు నందమూరి హీరో, ఇటు మెగా హీరో నటించడంతో.. ఇరువురి అభిమానులు సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు కలిసి నాటు నాటు పాటకు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అందరి నోట చర్చనియాంశంగా మారిన విషయం.. ఈ సినిమా కలెక్షన్లు. ముఖ్యంగా రాజమౌళి ఇంతకు ముందు బాహుబలి-2తో దేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీని తీసిన డైరెక్టర్‌గా నిలిచారు. ఇప్పుడు ఆయనే ఆర్ఆర్ఆర్ ను తీయడంతో.. బాహుబలి రికార్డులను చెరిపేశారా? అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక మూవీని డీవీవీ దానయ్య రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారని టాక్.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం..
మొదటి రోజు ఆర్ఆర్ఆర్ మూవీ.. రూ.80 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. ఇది ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మొదటి రోజు కలెక్షన్ల గురించి.. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పలువురు విశ్లేషకుల ప్రకారం.. నైజాంలో తొలి రోజు.. రూ.23.3 కోట్ల వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మొత్తం రూ.100 కోట్లపైనే ఉండొచ్చని సమాచారం.
ఇప్పటికే అమెరికాలో 5 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచినట్లు అంచనాలు వస్తున్నాయి.
Also read: Samantha: పుకార్లు, విమర్శలు వచ్చినా.. సమంత ఇంకా అతనితోనే ఉంది!!
Also read: RRR OTT Streaming: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎందులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook