RRR movie jr ntr interview: బాలయ్య బాబాయ్‌తో, చిరంజీవితో మల్టీ స్టారర్‌కు రెడీ: ఎన్టీఆర్
RRR movie jr ntr interview: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ బాబాయ్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పారు. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు అందరితో నటించేందుకు సిద్దమని తెలిపారు.
RRR movie jr ntr interview: ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ల హవా నడుస్తోంది. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ నుంచి.. త్వరలో విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్' క్రేజీ మూవీస్ అన్ని మల్టీస్టారర్ కావడం గమనార్హం. ఇక ఇదే విషయంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. బాలయ్య బాబాయ్‌తో మల్టీ స్టారర్ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.
ఇంతకీ ఏమైందంటే..
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మూవీ 25న థియేటర్లలో సందడి చేయనుంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇందులో ఎదురైన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
'టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. మల్టీ స్టారర్ మూవీస్ కు క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గట్లే అగ్రహీరోలంతా మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.. మరో మల్టీ స్టారర్ మూవీకి సిద్ధం' అని ప్రకటించారు.
బాబాయ్ బాలయ్యతో తాను కలిసి నటించాలనుకుంటున్నట్లు చెప్పారు ఎన్టీఆర్. చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్, అల్లు అర్జన్ అందరితోనూ తాను మల్టీ స్టారర్ సినిమా చేస్తానని చెప్పారు ఎన్టీఆర్. ఒకప్పుడు హీరో పాత్ర ప్రయారిటీ, సీన్లపై తేడాలుండేవని.. ఇప్పటి జనరేషన్ వాటన్నింటినీ దాటుకుని ముందుకొచ్చారన్నారు ఎన్టీఆర్. హీరో పాత్రలు ఇలానే ఉండాలనే లెక్కలు ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదన్నాడు. అభిమానులు కూడా పాత్రల నిడివి పట్టించుకోవడం మానేశారన్నారు. అందుకే ఎవరైనా ఏ భాషలోనైనా నటించొచ్చని చెప్పుకొచ్చారు.
Also read: Surekha Konidela: ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చిరంజీవి సతీమణి.. మొదటి పోస్ట్ ఏంటో తెలుసా?!!
Also read: Naina Ganguly Bold Pictures: నైనా గంగూలీ బోల్డ్ ఫొటోస్.. ఇలా ఎప్పుడూ చూసుండరు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook