RRR Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ సినిమా టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి
RRR Movie Ticket Price: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో టికెట్ పై రూ.75 పెంచుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కల్పించినట్లు అయ్యింది.
RRR Movie Ticket Price: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'రణం రౌద్రం రుధిరం' (ఆర్ఆర్ఆర్). ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాను దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో టికెట్టు పై రూ.75 పెంచుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే అంతుకు ముందు ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకనిర్మాతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యి.. సినిమా బడ్జెట్ గురించి వెల్లడించి, సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిని ఇవ్వాలని వారు కోరారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను రూ. 75 పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. తారక్ కొమురం భీమ్ గా తెరపై కనువిందు చేయనున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తో పాటు హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి.. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Also Read: Rakul Preet Photos: రంగురంగుల పువ్వోలే ఉన్నావే అందాల ముద్దుగుమ్మ!
Also Read: Samantha Photos: ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆ విషయంలో 'తగ్గేదేలే' అంటున్న సమంత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook