RRR Trailer Review: RRR ట్రైలర్ లో ఇది గమనించారా..? రామ్ Vs భీమ్ ఫైట్ సీక్వెన్స్
RRR Trailer Review: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR Movie ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. అటు థియేటర్లతో పాటు నెట్టింట్లోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందుగా కొన్ని కీలక సన్నివేశాలను ప్రేక్షకుల ఊహకే విడిచిపెట్టారు దర్శకుడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల మధ్య ఫైట్ సీక్వెన్స్ నుంచి వారిద్దరు బ్రిటీష్ అధికారులపై చేసే తిరుగుబాటు వరకు ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
RRR Trailer Review: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. అటు థియేటర్ తో పాటు సోషల్ మీడియాలోనూ ట్రైలర్ సందడి చేస్తుంది.
అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అలరించింది. అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు ఈ చిత్ర ట్రైలర్ పై ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. ఇండియన్ సినిమా పవర్ ను మరోసారి ప్రపంచానికి దర్శకుడు రాజమౌళి చాటి చెబుతారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లోని కొన్ని కీలక పాయింట్స్ మీరు గమనించారా?
RRR ట్రైలర్ లో ఇవి గమనించారా?
1) అదిలాబాద్ లోని గోండు తెగకు చెందిన ఓ బాలికను బ్రిటీష్ అధికారులు తీసుకొస్తారు.
2) అయితే ఆ గోండు తెగను కాపాడేందుకు ఓ రక్షకుడు ఉన్నాడని కీలకపాత్ర పోషించిన రాజీవ్ కనకాల బ్రిటీష్ అధికారులకు చెబుతాడు.
3) పులిని లొంగదీసుకునే కొమురం భీమ్ (ఎన్టీఆర్) ను కట్టడి చేసేందుకు వేటగాడు అల్లూరి సీతారామరాజు పోలీసును బ్రిటీష్ అధికారులు నియమిస్తారు.
4) కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య ఫైటింగ్ సీక్వెన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి.
5) అయితే అప్పటివరకు ఎవరిదారి వారిదిలా ఉన్న సీతారామరాజు, భీమ్ కలిసి బ్రిటీష్ అధికారులు మట్టికరిపించాలని ప్రణాళిక రచిస్తారు.
6) అందులో భాగంగా వారికి అజయ్ దేవగణ్, సముద్రఖని రూపంలో సహాయం అందుతుంది.
7) అప్పటి వరకు పోలీసుగా పనిచేసిన సీతారామరాజు.. దేశం కోసం అవసరమైతే తన ప్రాణాలనైనా ఇచ్చేస్తానని తన మనసులో మాట చెప్తాడు.
8) అజయ్ దేవగణ్ చెప్పే డైలాగు “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంటత అవే వస్తాయ్” తో పాటు రామ్ చరణ్.. ‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
9) ట్రైలర్ చివర్లో బ్రిటీష్ వారిపై సీతారామరాజు, భీమ్ తిరుగుబాటుకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉన్నాయి.
10) చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న మరోసారి బాక్సాఫీసుపై దండయాత్ర చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Also Read: RRR Movie Trailer: అవతార్ ని మించిన యాక్షన్.. ప్రపంచ దృష్టిని టాలీవుడ్ వైపు తిప్పేసిన జక్కన్న
Also Read: RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. 2 వేల కోట్లు కాదు 20వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook