RRR Movie Updates: సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాను దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ చిత్రబృందం మొదలుపెట్టింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలోని సర్ ప్రైజ్ సాంగ్ ను మూవీ రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సినిమాలో ప్రధానతారలైన రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాతో ఉన్న ఓ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి 'ఎత్తర జెండా' పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. "సినిమాలోని చివరి పాట అయిన 'ఎత్తర జెండా' పాటను ముందుగానే విడుదల చేసి సర్ ప్రైజ్ చేయాలని మేము భావించాం. ఆ సంతోషాన్ని మీతో త్వరగా పంచుకోవాలనే నేపథ్యంలోనే 'ఆర్ఆర్ఆర్' మూవీ సెలబ్రేషన్ ఆంథమ్ ను మార్చి 14న విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నాం. ఈ పాటతో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ చేద్దాం" అని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. 



రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. 


ALso Read; Radhe Shyam: తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ!!


ALso Read: Eesha Rebba Saree Pics: చీరకట్టులోని తెలుగందం.. మన తెలుగమ్మాయి ఈషా రెబ్బా! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook