RRR Latest Updates: దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ అభిస్తోంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, అబ్బురపరిచే గ్రాఫిక్స్, ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల అద్భుత నటన.. వెరసి ఆర్ఆర్ఆర్ రికార్డుల ప్రభంజనం ఖాయమని సినీ పండితులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదల వేళ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస మోహన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటివరకూ ప్రతీ ఫార్మాట్‌లో 12 సార్లు చూసినట్లు శ్రీనివాస మోహన్ తెలిపారు. సినిమా చూసిన ప్రతీసారి అంతకుమందు కంటే రెట్టింపు ఉత్సాహం, ఉత్సుకత కలిగిందన్నారు. సినిమా పట్ల ప్రేక్షకులు ఎలా స్పందిస్తారన్నది ఎగ్జయిటింగ్‌గా ఉందన్నారు. శ్రీనివాస మోహన్ గతంలో బాహుబలి ది బిగినింగ్, 2.ఓ, రోబో చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.


ఇవాళ విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్‌లలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. డాల్బీ విజన్‌లో విడుదలైన తొలి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. ఇక 3డీ ఫార్మాట్ విషయానికొస్తే... నిజానికి రాజమౌళికి అది అంతగా ఇష్టం లేకదు. 3డీ ఫార్మాట్ ఇష్టం లేకపోయినా ఆర్ఆర్ఆర్‌లోని కొన్ని సన్నివేశాలు ఆ ఫార్మాట్‌లో చూశాక రాజమౌళి ఫిదా అయిపోయారు. అందుకే సినిమా మొత్తాన్ని 3డీ ఫార్మాట్‌లోనూ విడుదల చేశారు.



ఇప్పటికైతే ఆర్ఆర్ఆర్ సినిమాకు అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ థియేటర్ల వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఈ సినిమా రూ.3వేల కోట్ల వరకు వసూలు చేయవచ్చుననే అంచనాలు నెలకొన్నాయి. 
 


Also Read: RRR Movie: బాహుబలి పాయే.. ఇకపై 'నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్': శోభు యార్లగడ్డ


Also Read: RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook