RRR Stars : ఆస్కార్ తరువాత విశ్వక్ ఈవెంట్లో ఎన్టీఆర్.. మోడీ ఈవెంట్లో చరణ్.. మరో కొత్త రచ్చ!
RRR Stars First Public Appearance : ఆస్కార్ అవార్డుల వేడుక తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ మొట్టమొదటి పబ్లిక్ అపీరియన్స్ 17వ తేదీన ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ తేజ ఇండియా టుడే సంస్థ నిర్వహించబోతున్న కాంక్లేవ్ కోసం, ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లబోతున్నారు.
RRR Stars First Public Appearance after Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్నారు రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇటీవల ఆస్కార్స్ వేడుకల్లో ఏకంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన నాటు నాటు సాంగ్ కు ఒరిజినల్ బెస్ట్ సాంగ్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.
ఇక ఈ వేడుక తర్వాత ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ రోజు తెల్లవారు జామున తిరిగి హైదరాబాద్ రావడంతో పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం కూడా పలికారు అభిమానులు. ఇంకా మరోపక్క రామ్ చరణ్ తిరిగి రాలేదు కానీ ఈరోజో రేపో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరు మొట్టమొదటి పబ్లిక్ అపీరియన్స్ 17వ తేదీన ఇవ్వబోతున్నారు. ఆస్కార్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ తేజ ఇండియా టుడే సంస్థ నిర్వహించబోతున్న కాంక్లేవ్ కోసం వెళ్లబోతున్నారు.
ఆ కాంక్లేవ్ లో నరేంద్ర మోడీ కూడా పాల్గొనబోతున్నారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ కాంక్లేవ్ లో రామ్ చరణ్ కూడా సినీ రంగం నుంచి పాల్గొనబోతున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న దాస్ కా ధమ్కీ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన హాజరు కాబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ ఏ రోజైతే ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొంటారో అదే రోజున విశ్వక్ సేన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు.
ఈ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు పోటీలు పడుతూ కామెంట్లు చేసుకుంటున్నారు. చరణ్ అభిమానులు మావాడు ప్రధానమంత్రి మోడీతో వేదిక పంచుకోబోతున్నాడని కామెంట్లు చేస్తుంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎక్కడా తగ్గకుండా ఇలాంటివి మా హీరో ఎప్పుడో చేసేసాడు అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు
Also Read: RGV Comments: తాగండి, తినండి, సెక్స్ చేయండి... విద్యార్ధులకు వర్మ సూచనలు!
Also Read: Gopireddy Challenges Balakrishna:మనిషే కదా..మూడో కన్ను ఎక్కడిది..బాలకృష్ణకు ఎమ్మెల్యే సవాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Faceboo