RRR Trailer Response: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ (RRR Trailer)ని చిత్రబృందం విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి డైరెక్షన్ మంత్రా తో తారక్ – చరణ్ నట విశ్వరూపానికి సోషల్ మీడియాలో విశేషాదరణ లభిస్తోంది. అటు ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రిటీలు RRR టీమ్ ను మెచ్చుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.



రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ట్రైలర్‌ ఆద్యంతం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి నిరూపించారు - బాబీ



బిగ్గెస్ట్‌ గ్లోబల్‌ యాక్షన్‌ డ్రామా అనే టైటిల్‌ ఈ ట్రైలర్‌కి సరిగ్గా సెట్‌ అవుతుంది. అద్భుతమైన ప్రపంచం, పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. చిత్రబృందానికి నా అభినందనలు. - మారుతి



రాజమౌళి సర్‌.. ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోంది. రామ్‌చరణ్‌, తారక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు. - కరణ్‌ జోహార్‌



అద్భుతమైన ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ పాత్రలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నా. - క్రిష్‌ 



ట్రైలర్‌ చూస్తే గర్వంగా ఉంది. వేరే లెవల్‌ ట్రైలర్‌ ఇది.  - విజయ్‌ దేవరకొండ



అత్యద్భుతం.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్‌ని రూపొందించారు. మన తారక్‌, చరణ్‌ అదరగొట్టేశారు. రాజమౌళి సర్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ విజన్‌. - అనిల్‌ రావిపూడి



టేక్‌ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్‌ అదిరిపోయింది.  - గోపీచంద్‌ మలినేని  


Also Read: RRR Movie Trailer: అవతార్ ని మించిన యాక్షన్.. ప్రపంచ దృష్టిని టాలీవుడ్ వైపు తిప్పేసిన జక్కన్న


ALso Read: RRR Trailer Review: RRR ట్రైలర్ లో ఇది గమనించారా..? రామ్ Vs భీమ్ ఫైట్ సీక్వెన్స్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook