Ruhani Sharma on Nani Sister : నిర్మాతగా నానికి ఉన్న మంచి టేస్ట్ గురించి అందరికీ తెలిసిందే. నాని ఇప్పటి వరకు నిర్మించిన రెండు సినిమాలు (అ!, HIT) మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఇప్పుడు నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో మీట్ క్యూట్ అనే చిత్రం రాబోతోంది. ప్రశాంతి త్రిపురనేని ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. నవంబర్ 25న ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో రాబోతోంది. ఈ క్రమంలో నిన్న ఈ సినిమా ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రేషన్స్ అంటూ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో నటీనటులు ఎంతో క్యూట్ క్యూట్‌గా మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాని, నాని సోదరిని పొగడ్తలతో ముంచెత్తారు. ఐదు కథలు, అందులో నటించిన నటీనటులతో స్టేజ్ మొత్తం నిండిపోయింది. అయితే ఇందులో ఓ కథలో నటించిన రాజా చెంబోలు, రుహానీ శర్మ స్టేజ్ మీద అల్లరి చేశారు. సెట్‌లో చేసిన పనుల గురించి చెప్పి అందరినీ నవ్వించారు. రాజా అయితే మొదట్లో సైలెంట్‌గా ఉండేవాడని, తరువాత తరువాత క్లోజ్ అయ్యామని.. ఆ తరువాత కొట్టుకునే వరకు వచ్చిందంటూ రుహానీ శర్మ చెప్పేసింది.


దేని కోసం కొట్టుకునేవాళ్లమో రాజా చెంబోలు బయటపెట్టేశాడు. దీప్తికి ఎవరు బాగా మసాజ్ చేయాలనే విషయంలో ఫైటింగ్ చేసుకునే వాళ్లమని రాజా చెప్పేశాడు. అప్పుడు మళ్లీ రుహానీ శర్మ అందుకుని అసలు విషయం బయటపెట్టేసింది. దీప్తికి షోల్డర్ మసాజ్ బాగా చేసేవాళ్లం.. ఎందుకంటే మళ్లీ ఆమె తన నెక్ట్స్ సినిమాలో చాన్స్ ఇస్తుందనే అలా చేశామంటూ కాకా పట్టినట్టు అలా అందరి ముందే చెప్పేసింది. మరి రుహానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా? దీప్తి తన తదుపరి చిత్రాల్లో చాన్స్ ఇస్తుందా? అన్నది చూడాలి.


సినిమా ఆఫర్ కోసం నటీనటులు మాత్రం మంచిగా ఇలాంటి పనులు చేసి దర్శకుల్ని కాకపట్టేస్తున్నారన్న మాట. మరి దీప్తికి ఈ మీట్ క్యూట్ బాగా కలిసి వచ్చి.. ఇంకో సినిమాను త్వరగా ప్రారంభిస్తే.. మళ్లీ ఇదే టీంతో కలిసి పని చేస్తుందా? మళ్లీ కొత్త వారిని తీసుకుంటుందా? అన్నది చూడాలి.


Also Read : Sreemukhi Latest Pics : బుల్లి గౌనులో భారీ ప్రదర్శన.. శ్రీముఖి అందాల విందు.. కాకరేపుతున్న ఫోటోలు


Also Read : HanuMan Teaser : హనుమాన్ టీజర్.. ఆదిపురుష్‌కు తిట్లు.. విజువల్ వండర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook