Sunny Leone Quotation Gang Movie: జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన మూవీ క్యూ జి.. వివేక్ కుమార్ దర్శకత్వం వహిస్తూ.. ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్‌పై నిర్మించగా.. గాయత్రి సురేష్ మరో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ మూవీపై భారీ అంచనాల నేపథ్యంలో తెలుగు రైట్స్‌ కోసం హై కాంపిటీషన్‌ ఉండగా.. తెలుగు వరల్డ్ వైడ్ విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత ఎం.వేణుగోపాల్ దక్కించుకున్నారు. రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ఆయన తెలుగు ప్రేక్షకులను అందించనున్నారు. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ నటిస్తుండగా.. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌తో మరింత అంచనాలు పెరిగిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kolkata Doctor Case:  ఆ దుర్మార్గుడికి శిక్ష ఎలా ఉండాలంటే.. కాక రేపుతున్న మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలు..


తెలుగు రైట్స్ దక్కిన సందర్భంగా ప్రొడ్యూసర్ ఎం.వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం భారీగా కాంపిటీషన్ ఉందని.. అయినా తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమిళ నిర్మాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోందని.. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా అదిరిపోయిందన్నారు. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన ఈ చిత్రానికి హైలెట్ అవుతాయని.. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


==> యాక్టర్స్: జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా అర్జున్.


టెక్నీషియన్స్ :
==> బ్యానర్ : రుషికేశ్వర్ ఫిలిమ్స్, ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్
==> పొడ్యూసర్స్ : ఎం. వేణుగోపాల్, వివేక్ కుమార్ కన్నన్, గాయత్రి సురేష్
==> DOP: అరుణ్ బాత్మనబన్
==> సంగీతం : డ్రమ్స్ శివమణి
==> ఎడిటర్ : కె.జె. వెంకటరమణన్
==> డైరెక్టర్ : వివేక్ కుమార్ కన్నన్
==> డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
==> PRO : మధు VR


Also Read: Nita Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..నీతా అంబానీ వారి పిల్లల జీతం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు