Prabhas Challenge : డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) ఇచ్చిన ఛాలెంజ్ ను సాహో ( Saaho ) మూవీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పూర్తి చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ కు సమీపంలోని దుండిగల్ దగ్గరి కాజీపల్లి రిజర్వు ఫారెస్టు వద్ద సుమారు 1650 ఎకరాల ఆటవిక భూమిని దత్తత తీసుకున్నాడు. తన తండ్రి పేరిట అడవి భూమిని అర్భన్ పార్కుగా డెవలెప్ చేస్తానని ప్రకటించాడు. తను ఎప్పడు నేచర్ లవర్ నే అని చెప్పిన ప్రభాస్ తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు.
Related Story: Prabhas adopts forest land: అటవీ భూమిని దత్తత తీసుకున్న హీరో ప్రభాస్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ( TRS ) రాజ్య సభ ఎంపి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ( Green India Challenge ) లో భాగంగా ప్రభాస్ తన టాస్క్ ( Prabhas Completes Green India Challenge ) పూర్తి చేశాడు. తన ఛాలెంజ్ ను పూర్తి చేసిన తరువాత శ్రద్ధా కపూర్ ను నామినేట్ చేశాడు. ప్రభాస్ నామినేషన్ ను యాక్సెప్ట్ చేసిన శ్రద్ధా  మొక్కలను నాటి.. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.  ఈ ఫోటోను షేర్ చేస్తున్న సమయంలో శ్రద్ధా ఇలా రాశారు " గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నన్ను నామినేట్ చేసినందుకు ప్రభాస్ నీకు ధన్యావాదాలు. నేను ఇప్పుడే కొన్ని మొక్కలు నాటాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు శ్రద్ధా. 
 


ఈ పోస్ట్ చేసే సమయంలో శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor) పెట్టిన హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. #HaraHaiTohBharaHai అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసింది ఈ అమ్మడు. దీనర్థం..పచ్చదనం ఉంటే పరిపూర్ణత్వం ఉంటుంది అని...


Also Read: Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన టీఆర్ ఎంపి సంతోష్ కుమార్ ( TRS MP Santosh Kumar J) కూడా తన ట్విట్ ఎకౌంట్ లో దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టాడు. శ్రద్ధా కపూర్ మొక్కలు నాటిన ఫోటోను షేర్ చేసిన ఆయన ఇలా ట్వీట్ చేశాడు.. "బాహుబలి @PrabhasRaju గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసినందుకు @ShraddhaKapoor గారికి ధన్యవాదాలు. మీ అభిమానగణం ఈ మంచి పనిని ముందుకు తీసుకెళ్తారు అని.. బాలీవుడ్, టాలీవుడ్ లో దీనిని అమలు చేస్తారు అని ఆశిస్తుస్తున్నాను అని ట్వీట్ చేశారు.



రాజ్య సభ ఎంపి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను టాలీవుడ్ తారలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ, వ్యాపార, క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలు పూర్తి చేస్తున్నారు. పచ్చదనాన్ని ప్రోత్సాహించే ఇలాంటి ఛాలెంజ్ లు మనకు అవసరం అని సెలబ్రిటీలు అంటున్నారు. కాగా ఈ #GreenIndiaChallenge ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను దాటి ముంబైకి చేరడం మంచి విషయమే.


Read Also: NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR