Sai Dharam Tej Fight With Manager హీరోలకైనా, హీరోయిన్లకైనా, ఆర్టిస్టులకైనా సరే ఈ మేనేజర్ వ్యవస్థ ఇప్పుడు ఎక్కువగా పాకింది. ఒకప్పుడు అయితే హీరో, హీరోయిన్లకు నేరుగా దర్శక నిర్మాతలతో మాట్లాడే యాక్సెస్ ఉండేది. డేట్లు కూడా వారే సొంతంగా చూసుకునే వారు. కానీ ఇప్పుడు కథ వినాలన్నా, విన్న కథకు డేట్స్ అడ్జస్ట్ చేయాలన్నా కూడా అది మేనేజర్లే డిసైడ్ చేస్తున్నారు. దీంతో హీరో, హీరోయిన్లు అంతా కూడా మేనేజర్ వ్యవస్థ మీదే ఆధారపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇందులో కొంత మంది మేనేజర్ల వల్ల పూర్తిగా నష్టపోయిన వారున్నారు. దర్శక నిర్మాతలు సైతం మేనేజర్ల వల్ల నష్టపోయిన వారున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తన మేనేజర్‌తో గొడవ పడినట్టు టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ మేనేజర్ సతీష్‌ ఓ మెగా అభిమాని. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండే సతీష్‌ను.. సాయి ధరమ్ తేజ్ తన వద్ద పెట్టేసుకున్నాడు. ఈ ఇద్దరూ హీరో, మేనేజర్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉండేవారు.


అయితే సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం బ్రో సెట్‌లో ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. కేరవ్యాన్‌లోనే సతీష్‌, సాయి ధరమ్ తేజ్ మధ్య వాగ్వాదం జరిగినట్టుగా టాక్. అయితే కారణాలు ఏంటన్నది మాత్రం సరిగ్గా తెలియడం లేదు. మొత్తానికి బ్రో సెట్‌లో మాత్రం కాస్త గందరగోళ వాతావరణం నెలకొందని సమాచారం. అయితే ఈ ఇద్దరూ శాశ్వతంగా ఇలానే దూరాన్ని మెయింటైన్ చేస్తారా? మళ్లీ కలిసి పోతారా? అన్నది చూడాలి.


Also Read: Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా?


సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిన తరువాత ప్రతీ విషయాన్ని సతీష్‌ దగ్గరుండి చూసుకున్నాడు. విరూపాక్ష షూటింగ్‌లో, పబ్లిసిటీ, ప్రమోషన్స్ సమయంలోనూ సాయి ధరమ్ తేజ్ వెంటే ఉన్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఇలా గ్యాప్ ఏర్పడటానికి గల కారణం ఏంటని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.


Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK