Sai Dharam Tej For Sai Ram Shankar Vey Dharuvey పూరి జగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తన కంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రామ్ శంకర్. హీరోగా, నటుడిగా తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోయాడు. గత కొన్నేళ్లుగా గ్యాప్ ఇచ్చిన సాయి రామ్ శంకర్ ఇప్పుడు.. మళ్లీ హీరోగా రాబోతోన్నాడు. వెయ్ దరువెయ్ అనే సినిమాతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సుప్రిమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ను రంగంలోకి దించారు. సాయి రామ్ శంకర్ కోసం సాయి ధరమ్ తేజ్ వచ్చాడు. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం..  టీజర్  చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందని ప్రశంసించాడు. సినిమా చూడాలనే కుతూహలాన్ని పెంచేస్తోందని మెచ్చుకున్నాడు. సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని, సాయి అన్నకి  డైరెక్టర్ , ప్రొడ్యూసర్ ఇలా అందరికీ థాంక్స్ చెప్పాడు.


 



ఇక హీరో హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. సుప్రీం సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉందని అన్నాడు. తమ సినిమా నుంచి ఇది వరకే రెండు సాంగ్స్  రిలీజ్ అయ్యాయని, వాటికి మంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన సాయిధరమ్ తేజ్‌కి హృదయపూర్వక ధన్యవాదలు తెలిపాడు. తమ టీం తన మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను అని నవీన్ రెడ్డి అన్నాడు. 


సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా తమ సినిమా టీజర్ రిలీజ్ అయినందుకు ఆనందంగా ఉందని, తాము అనుకున్నట్టే చాలా బాగా వచ్చిందని నవీన్ రెడ్డి అన్నారు ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని, ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని  మార్చ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత దేవరాజ్ తెలిపాడు.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook