Sai Dharam Tej Imitated Pawan Kalyan and Balakrishna: నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ షో ద్వారా ఆయనలో ఉన్న మరో కోణం ఏమిటి అనేది ప్రేక్షకులందరికీ అర్థమైంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు బాలకృష్ణకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఎవరినైనా ఆయన వెంటనే కొట్టేస్తారు, ఆయనతో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని అందరూ భావిస్తూ రాగా ఒక్కసారిగా ఈ షో ఆయన మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ అంతా తీసేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే ఆయనతో కనిపించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఒక ఎపిసోడ్ కు హాజరైన సంగతి తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్, క్రిష్, నిర్మాత నాగవంశీతో కలిసి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షోకి హాజరవుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ షోలో భాగంగా నందమూరి బాలకృష్ణ అడిగిన భార్యల ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఓపెన్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.


ఇప్పటివరకు తన మనోగతాన్ని ఎవరి ముందూ బయట పెట్టని పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షోలో మాత్రం తన ఉద్దేశాలను, భావాలను, తన బాధలను పంచుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బాలకృష్ణ సైతం పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఇకమీదట ఎవరైనా కామెంట్లు చేస్తే వారంతా ఊర కుక్కలు అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


ఇక ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఈ షో నుంచి మరో లీక్ అయితే బయటకు వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా కొన్ని క్షణాల పాటు కనిపించినట్లు తెలుస్తోంది. ముందుగా అయన వీడియో కాల్ లో కనిపిస్తారని అనుకున్నా నేరుగా తీసుకువచ్చారని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ సాయిధరమ్ తేజ్ ని పవన్ కళ్యాణ్ మేనరిజం ఇమిటేట్ చేసి చూపించమంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఆశీస్సులు తీసుకుని సాయిధరమ్ తేజ్ చేసి చూపించారని తెలుస్తోంది.


అదేవిధంగా నన్ను ఇమిటేట్ చేయమని బాలకృష్ణ అడిగితే అదే సెట్ లో తొడగొట్టి ఒక్కసారిగా అందరినీ అలరించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వినోదయసిత్తం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకి కూడా డైరెక్షన్ వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తమ్ముడు రీమేక్ తో అకీరా నందన్ లాంచ్ అవుతాడా? అని అడిగిన ప్రశ్న కూడా హాట్ టాపిక్ అయినట్టు చెబుతున్నారు.  


Also Read: Venuswamy on Prabhas: 2023 నుంచి దారుణంగా ప్రభాస్ పరిస్థితి.. వేణు స్వామి సంచలన కామెంట్లు!


Also Read: Rakesh on Anchor Rashmi: రష్మీ అలా డబ్బు సంపాదిస్తోంది.. రాకేష్ షాకింగ్ కామెంట్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook