Sai Dharam Tej: మా మామయ్య ఎమ్మెల్యే కాదు.. సాయిధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి నుంచి.. పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక ఎప్పుడూ ఈ హీరో చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Pawan Kalyan -Sai Dharam Tej: ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, జనసేన పార్టీ, బిజెపి కలిసి కూతమి ఏర్పరిచి వైసిపి పైన అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడం ఆయన అభిమానులను సంబరాలు జరుపుకునేలా చేసింది. అంతేకాకుండా జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ సంచలన విజయాన్ని మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది.
ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్.. తన మామ గెలిసిన ఆనందంలో నిన్నటి నుంచి పోస్టుల పైన పోస్టులు వేస్తున్నారు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకుని ఎత్తుకొని తిప్పేసిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ క్రమంలో ఇంకా కూడా పవన్ కళ్యాణ్ పైన ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు ఈ హీరో. అయితే ఈసారి డైరెక్ట్ గా ట్వీట్ వెయ్యకుండా.. ఒక ట్విట్టర్ పేజ్ షేర్ చేసిన వీడియోకి కౌంటర్ వేస్ట్ ట్వీట్ వేశాడు.
సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు సరదాగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పోస్టులు చేయడం, పోస్టర్స్ వేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ గెలుపుతో సాయి ధరమ్ తేజ్ ఆనందం చూసి ఓ నెటిజన్.. పిఠాపురం ఎమ్మెల్యే గారి మేనల్లుడు తాలూకా… అంటూ సరదాగా ఓ వీడియో మీమ్ షేర్ చేశారు. ఈ వీడియోలో ‘మా మామ ఎమ్మెల్యే’ అని ఒక సినిమాలో డైలాగ్ కి..తేజ్ ఫేస్ పెట్టి.. ఆ పోస్ట్ షేర్ చేసారు.
ఇక సాయి ధరమ్ తేజ్ ఈ సరదా మీమ్ కి రిప్లై ఇస్తూ.. ‘మా మామయ్య ఎమ్మెల్యే కాదు…మా మామ మీ ఎమ్మెల్యే…ఆయన గెలిపించినందుకు మీ అందరికి శిరసు వంచి కోటి దండాలు’ అంటూ సరదాగా ట్వీట్ పెట్టాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Also read: Naralokesh: పప్పు కాదూ నిప్పు.. 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నారా లోకేష్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook