Sai Dharam Tej Released Jalsa Re Release Trailer: ఈ మధ్య టాలీవుడ్ లో పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ఈ నెల మొదట్లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలను పలుచోట్ల రిలీజ్ చేయగా దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే ఇతర హీరోల అభిమానులు కూడా తమ తమ హీరోల పుట్టినరోజు సందర్భంగా సూపర్ హిట్ సినిమాలు మళ్ళీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు స్పెషల్ షోలు వేశారు. ఇక మరికొద్ది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆయన నటించిన జల్సా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు.


ఇక సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ జల్సా స్పెషల్ షోలు రిలీజ్ అవుతున్నాయి. ఇక సినిమా రీ రిలీజ్ అన్న మాటే గాని ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత హడావిడి చేస్తున్నారో ఇప్పుడు కూడా దాదాపుగా అంతే హడావిడి చేస్తున్నారు మేకర్స్, అభిమానులు, తాజాగా సెప్టెంబర్ ఒకటవ తేదీన రీ రిలీజ్ కానున్న జల్సా 4k ట్రైలర్ వర్షన్ ట్రైలర్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు.


పూర్తిస్థాయి క్వాలిటీతో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. రెండు నిమిషాల 15 సెకన్ల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఈ క్వాలిటీతో సినిమా చూస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.



Also Read: Kamal Rashid Khan Judicial Custody: నోటి దురదకు చెల్లించక తప్పదు మూల్యం.. క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. 14 రోజుల జైలు?


Also Read: Ram Charan shelved Gowtam Movie:గౌతంకు షాకిచ్చిన రామ్ చరణ్.. అన్నీ ఓకే అనుకున్నాక రెడ్ సిగ్నల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి