Sai Pallavi Farming: గతేడాది హీరో నాని సరసన 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో అలరించిన నటి సాయి పల్లవి.. ఇప్పుడు కూలీ అవతారమెత్తింది. కూలీగా పొలంలో పని చేసింది. అయితే అంతటి స్టార్ హీరోయిన్ పొలంలో పనిచేయడమేంటని చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా 'ఫిదా' సినిమాలో నటించింది. ఇందులో భానుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిలా దగ్గరైపోయింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి.. గతేడాది 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. 



తాజాగా ఉగాది పండుగ సందర్భంగా విన్నూత్నంగా ఆలోచించిన సాయి పల్లవి.. ఇప్పుడు రైతుగా మారింది. కాకపోతే ఆ మార్పు సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదండోయ్. ఉగాది రోజున రైతుగా మారి పొలంలో పనులు చేసింది. మిగిలిన కూలీల్లాగే ఏదో పంట కోత కోస్తోంది. పనులు పూర్తైన తర్వాత అక్కడున్న వారందరితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.  


Also Read: Malaika Arora Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా కారుకు ప్రమాదం.. గాయాలతో ఆస్పత్రిలో చేరిక!


Also Read: Beast Movie Trailer: విజయ్ దళపతి 'బీస్ట్' మూవీ ట్రైలర్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook