Sai Pallavi in Pushpa: పుష్ప సినిమాలో సాయి పల్లవి
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో `పుష్ప` సినిమా ( Pushpa movie ) కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun), రష్మిక మందనల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'పుష్ప' సినిమా ( Pushpa movie ) కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun), రష్మిక మందనల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి ( Sai Pallavi ) కీలక పాత్ర పోషించనుంది అని తెలుస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలు పాత్ర పోషించడానికి డైరెక్టర్ సుకుమార్, సాయి పల్లవిని సంప్రదించాడని తెలుస్తోంది. సాయి పల్లవికి ఓకే అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా సాయి పల్లవి కనిపించబోతోందన్న మాట. Also read :
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న ( Rashmika Mandanna ) పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు.
అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ పెద్ద ట్విస్ట్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. అది బన్నీ అభిమానుల అంచనాలను మరింత పెంచుతోంది. అలాగే ఈ థ్రిల్లర్ డ్రామాలో బన్నీ రెండు వేర్వేరు షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. Also read :
ప్రస్తుతం సాయి పల్లవి 'విరాట పర్వం' సినిమాలో ( Virata Parvam ) రానా దగ్గుబాటికి జోడిగా కనిపించనుంది. అలాగే నాగ చైతన్య సరసన 'లవ్ స్టోరీ' సినిమాలోనూ ( Naga Chaitanya's Love story ) నటిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe