Sai Pallavi Viral Video: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో నిజంగానే మన అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఆ తరువాత కూడా వచ్చిన ఆఫర్లు అన్నీ ఒప్పుకోకుండా తన క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ వచ్చింది ఈ హీరోయిన్. ఎక్స్పోజింగ్ కి చాలా దూరం ఉంటూ.. కేవలం తన అభినయం.. డాన్స్ తోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో డబ్బులు ఇస్తామన్నా కానీ కొన్ని బ్రాండ్స్ కి అడ్వటైజ్మెంట్ కూడా ఇవ్వను అని చెప్పి ప్రేక్షకుల మధ్యలో మరింత చోటు సంపాదించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి సాయి పల్లవి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి సౌత్ నుంచి బాలీవుడ్ కి కూడా చేరింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో ఒక సినిమా చేస్తోంది. ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి ‘ఏక్ దిన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ జపాన్ లో శరవేగంగా జరుగుతుంది. అక్కడి షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.


తాజాగా ఈ చిత్ర యూనిట్ మొత్తం కలిసి అక్కడ పబ్ లో ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలో సాయి పల్లవి పబ్బులో ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు హిందీ సూపర్ హిట్ సాంగ్స్ కి మూవీ యూనిట్ తో  పాటు సాయి పల్లవి కూడా స్టెప్పులు వేసింది. ఈక్రమంలోనే సాయి పల్లవి ఫుల్ ఎంజాయ్ చేస్తూ వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


 



కాగా ఈ సినిమా జపాన్ షెడ్యూల్ పూర్తయిందని, అందుకే సినిమా యూనిట్ సెలబ్రేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లో రామాయణంలో కూడా సాయి పల్లవి నటిస్తోందని సమాచారం


Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!


Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter