Sai Pallavi Pics : చాలా రోజుల తరువాత సాయి పల్లవి పోస్ట్.. పిక్స్ వైరల్
Sai Pallavi Pics సాయి పల్లవి సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ పిక్స్, పర్సనల్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా సాయి పల్లవి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
Sai Pallavi Pics సాయి పల్లవి గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాటపర్వం సినిమాతో వెన్నెలగా మెస్మరైజ్ చేసింది సాయి పల్లవి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కమర్షియల్‌గా ఆడకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది. సాయి పల్లవి నటనకు అంతా ఫిదా అయ్యారు. అయితే సినిమా అంటే డబ్బులే మ్యాటర్ కాబట్టి.. విరాటపర్వం ఓ ప్రయోగంగా సఫలమైనా కూడా కమర్షియల్‌గా విఫలమైనట్టే. దీంతో సాయి పల్లవి కష్టం అంతా కూడా వృథా అయిపోయింది.
విరాటపర్వంతో సక్సెస్ రాకపోయినా సాయి పల్లవికి వివాదాలు మాత్రం చుట్టుముట్టాయి. హింస, గోమాతల సంరక్షణ పేరిట ముస్లింల మీద హిందువులు చేసే దాడిని కూడా తప్పు పట్టింది. నక్సలిజం మీద స్పందిస్తూ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మీద కూడా స్పందించింది. ఇలా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఓ వర్గం సాయి పల్లవిని ద్వేషించింది. ఇంకో వర్గం సాయి పల్లవి గట్స్‌ను మెచ్చుకుంది. హింస ఎక్కడున్నా హింసే.. ఏ రూపంలో ఉన్నా హింసే.. అది ఎవరు చేసినా తప్పే అని చెప్పడమే తన ఉద్దేశ్యమని, తాను ఒక డాక్టర్ అని, తనకు ప్రాణం విలువ తెలుసు అని సాయి పల్లవి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
ఆ తరువాత సాయి పల్లవి గార్గి సినిమాతో దక్షిణాదిని ఆశ్చర్యపరిచింది. గార్గి సినిమాలో సాయి పల్లవి నటన అందరినీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ మాత్రం అందరినీ మెలిపెట్టేస్తుంది. అలా గార్గి సినిమాతో సాయి పల్లవి తన నటనా కౌశలాన్ని మరోసారి ప్రదర్శించింది. అయితే సాయి పల్లవికి మాత్రం గడిచిన ఏడాది కాస్త కష్టంగానే నడిచింది. ఇక సాయి పల్లవి మధ్యలో సినిమాలకు దూరమైందనే టాక్ కూడా వచ్చింది. సినిమాలు మానేసి డాక్టర్ వృత్తిని ఎంచుకుందని టాక్స్ వచ్చాయి.
న్యూ ఇయర్ వేడుకల్లో గుళ్లు, గోపురాలు, యోగా, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కనిపించడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది సాయి పల్లవి. హీరోయిన్లంతా పబ్బులు, పార్టీలు అంటే నువ్ మాత్రం ఇలా గుళ్లు గోపురాలు తిరుగుతున్నావ్ చూడు అంటూ సాయి పల్లవిని అంతా పొగిడేశారు. ఇప్పుడు సాయి పల్లవి చాలా రోజుల తరువాత ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్టోబర్‌లో ఆమె చివరగా ఓ పోస్ట్ వేసింది. మళ్లీ ఇప్పుడు తన పెట్‌తో కలిసి ఇలా పోజులు ఇచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి