Sai Rajesh Cinematic Universe: హృదయ కాలేయం సినిమాతో మనకు దర్శకుడుగా పరిచయమైన సాయి రాజేష్.. ఆ తరువాత కలర్ ఫోటో లాంటి ఒక క్లాసిక్ సినిమాని నిర్మాతగా మనకు అందించి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని బేబీ సినిమాతో మన ముందుకి వచ్చారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ విడుదల దగ్గర నుంచే యూత్ లో ఎక్కడలేని అంచనాలను తెచ్చుకునింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా టీజర్, పోస్టర్స్, ట్రైలర్ లోనే కాదు సినిమాలో కూడా విషయం ఉండడంతో ఫైనల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ నటించిన ఈ చిత్రం తెలుగు యువతను ఎక్కువగా ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. ఇక ఈ సినిమాలో పరిస్థితుల వల్ల ఒక అమ్మాయి పడే బాధని.. సాయి రాజేష్ చక్కగా చూపించిన అది యూత్ కి మాత్రం వేరే విధంగానే అర్థమైంది. ఆయన సినిమాని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపియ్యాలి అనుకుంటే ఫైనల్ గా అది హీరోయిన్ క్యారెక్టర్ కి యాంటీగా అర్థమయ్యే.. ఆయన అనుకున్న కథ ఒకటిగా.. ఫైనల్ గా ప్రేక్షకులకు అర్థమైన మెసేజ్ ఒకటిగా మిగిలింది. మొత్తానికి ఏది ఏమైనా ప్రేక్షకులను ఆకట్టుకోకుండా మాత్రం ఈ సినిమా మిగలలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రస్తుత యువత ఫీలింగ్స్ ను మనకు అద్దం పట్టేలా చూపించింది.


ఇక్కడ వరకు కథ బాగానే ఉన్నా.. ఇప్పుడు సాయి రాజేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆయన వైపు తిప్పాయి. తాజాగా బేబీ సినిమాని తీసిన నిర్మాత SKN తో కలిసి సాయి రాజేష్ ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. యూట్యూబర్ అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్ హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పోస్టర్ అచ్చం బేబీ సినిమా మొదటి పోస్టర్ లానే యువతను బాగా ఆకట్టుకుంటోంది.


ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్న జరగగా ఆ ఈవెంట్లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. నేను మంచి లవ్ స్టోరీ ఉంటేనే ప్రొడ్యూస్ చేస్తాను. గతంలో కలర్ ఫోటో సినిమా తీసి మంచి విజయం సాధించడంతో పాటు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాము.  బేబీ సినిమాతో నాపై ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు కూడా లవ్ స్టోరీతోనే రాబోతున్నాము. సోషల్ మీడియాలో నిబ్బా నిబ్బి స్టోరీలు అని నన్ను ట్రోల్ చేసినా సరే మొత్తం మా దగ్గర ఆరు లవ్ స్టోరీలు ఉన్నాయి. అవి తప్పకుండా తీయాలి అని నేను, SKN 
ఫిక్స్ అయ్యాం. అందులో కలర్ ఫోటో, బేబీ సినిమాలు రెండు అయిపోయాయి. ఇటీవల వైష్ణవి, ఆనంద్ తో ఇంకో సినిమా అనౌన్స్ చేశాం. ఇప్పుడు సంతోష్, హారికలతో ఈ సినిమా చేస్తున్నాం. ఇక ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా తీయాలని ఉన్నాము
అలాగే.. ఈ స్టోరీలు సినిమాటిక్ యూనివర్స్ లు కాదు, సీక్వెల్స్ కాదు. నేనేమి లోకేష్ కానగరాజ్ కాదు' అని తెలియజేశారు.


కాగా సాయి రాజేష్ సినిమాటికి యూనివర్స్ కాదు అన్నా కానీ.. సాయి రాజేష్ తీస్తున్న సినిమాలు మాత్రం యువత విషయంలో అలానే ఉండబోతున్నాయి. ఎందుకు అంటే కలర్ ఫోటో అలానే బేబీ సినిమాలు రెండు కూడా యువతకు బాగా కనెక్ట్ అయ్యి వారి ప్రశంసలు అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు చూస్తేనే సాయి రాజేష్ తప్పకుండా తన సినిమాలో యువతకు పుష్కలంగా నచ్చే అలానే ప్రస్తుత యువతకు కనెక్ట్ అయ్యే అంశాలను తపకుండ పెట్టేస్తారు అని అర్థమవుతుంది. ఇక ఇప్పుడు సాయి రాజేష్ నుంచి రాబోతున్న రెండు సినిమా పోస్టర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. 


మొత్తానికి ఒక సినిమాతో మరో సినిమా లింక్ లేకపోయినా..యువత ఫీలింగ్స్ ని అలానే వారి పల్స్ ని కరెక్ట్ గా పట్టి సాయి రాజేష్ నిజంగానే తన లవ్ స్టోరీ సినిమాటీకి యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నారు. తన తదుపరి సినిమాలతో కూడా కలర్ ఫోటో, బేబీ లాంటి హవా కొనసాగిస్తే.. తప్పకుండా చిన్న బడ్జెట్ లవ్ స్టోరీ లకు ఈయన ఒక రాజమౌళి అవ్వడం ఖాయం. ఎందుకు అంటే మాస్ ఆడియన్స్ అలానే పాన్ ఇండియా ఆడియన్స్ పల్స్ ని ఎలాగైతే రాజమౌళి పట్టేశాడు అలానే మన తెలుగు యూత్ ఆడియన్స్ పల్స్ ని అంత కరెక్ట్ గా పత్తేశారు సాయి రాజేష్.


 


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook