Baby remake :ఈ మధ్య విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసింది. టీజర్ నుంచే ఆసక్తి రేపుతూ వచ్చిన ఈ సినిమా విడుదలైన తరువాత కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం 10 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేయగా ఇప్పుడు హిందీలో మాత్రం రీమేక్ చేయబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ రీమేక్ లో మరో ప్రత్యేక విషయం ఏమిటి అంటే..తెలుగులో డైరెక్ట్ చేసిన సాయి రాజేశే హిందీలో కూడా తెరకెక్కించనున్నాడట. ఇక హిందీలో ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారు అని తెలుస్తోంది. సాయి రాజేష్ ప్రత్యేకంగా కూర్చుని మరి బాలీవుడ్ రైటర్స్ తో హిందీ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడట. ఈ మధ్యనే సాయి రాజేష్ స్థానం తెలుగులో బేబీ లాగా మరో నాలుగు సినిమాలు దర్శకత్వం లేదా ప్రొడ్యూస్ చేస్తాను అని కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇప్పుడు హిందీలో తన బేబీ రీమేక్ పనుల్లో కూడా పడిపోయారు ఈ డైరెక్టర్.


ఇక హిందీలో రీమేక్ కాబోతున్న బేబీ సినిమాతో ఒక స్టార్ హీరో కొడుకుని యాక్టర్ గా లాంచ్ చేయబోతున్నారట. కానీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అనేది ఇంకా బయటపడలేదు. మరో విశేషం ఏమిటి అంటే హీరోయిన్ గా తెలుగులో ఎలా అయితే యూట్యూబ్లో ఫేమస్ అయిన వైష్ణవి చైతన్యాన్ని తీసుకున్నారు .. హిందీలో కూడా అదేలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఒక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని ఉన్నారట. ఇందుకోసం హిందీ సోషల్ మీడియా వర్గాల్లో క్రేజ్ సంపాదించుకున్న ముగ్గురు అమ్మాయిల పేర్లను పరిశీలిస్తున్నారట. వారిలో ఒకర్ని ఫైనల్ చేసి హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు. అయితే ఈ రీమేక్ వార్త గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook