Sai Ram Shankar: `ఒక పథకం ప్రకారం` హీరోగా తన లక్ పరీక్షించుకుంటున్న పూరీ తమ్ముడు సాయి రామ్ శంకర్..
Sai Ram Shankar - Oka Pathakam Prakarm Movie: పూరీ జగన్నాథ్ తమ్ముడుగా టాలీవుడ్లో అడుగు పెట్టిన సాయి రామ్ శంకర్ హీరోగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. బంపరాఫర్ మినహా ఈయన కెరీర్లో హిట్ అనేది లేదు. 2017 తర్వాత హీరోగా నటించలేదు. తాజాగా ఈయన ఒకేసారి మూడు సినిమాలతో పలకరించనున్నారు. అందులో `ఒక పథకం ప్రకారం` సినిమా సహా పలు బంపరాఫర్ 2 మూవీలున్నాయి.
Sai Ram Shankar - Oka Pathakam Prakarm Movie: వినోద్ విజయన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ బ్యానర్‌పై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా 'ఒక పథకం ప్రకారం'. ఈ సినిమాలో సాయి రామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతీ సోదీలు హీరో హీరయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్ విజయన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్ విజయ్ మాట్లాడుతూ.. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ థ్రిల్లర్ సినిమాలో హీరో సాయి రామ్ శంకర్ మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ అడ్వకేట్ పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. సముద్రఖని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్నారు.
రాహుల్ రాజ్ రెండు పాటలు అందించగా.. సిధ్ శ్రీరాం అద్భుతంగా పాటలు పాడారు. ఇప్పటికే టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదలై మొదటి పాట "ఒసారిలా రా" మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. సాయి రామ్ శంకర్ విషయానికొస్తే.. రవితేజ హీరోగా నటించిన 'ఇడియట్' మూవీలో చిన్న పాత్రతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత అన్నయ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన '143' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'డేంజర్', 'హలో ప్రేమిస్తారా', నేనింతే, బంపరాఫర్ వంటి చిత్రాల్లో నటించారు. అందులో బంపరాఫర్ మూవీ బంపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అర డజనుకు పైగా సినిమాల్లో నటించిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఇపుడు 'ఒక పథకం ప్రకారం' మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమాతో సాయి రామ్ శంకర్ హీరోగా సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Also read: Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook