Sailesh Kolanu to Direct Victory Venkatesh: చివరిగా ఎఫ్3 అనే సినిమాలో హీరోగా నటించిన విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత హీరోగా ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా అనే సినిమాలో దేవుడి పాత్రలో నటించిన ఆయన తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద చాలా ప్రచారాలు జరిగాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు వెంకటేష్ తర్వాత సినిమా మీద ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటేష్ హిట్ 2 సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలనుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆస్ట్రేలియా దేశంలో సైంటిస్ట్ గా పని చేస్తున్న శైలేష్ కొలను ఖాళీ సమయాల్లో రాసుకున్న ఒక కథను నానికి వినిపించగా నాని ఆ సినిమాని నువ్వే డైరెక్ట్ చేయాలి అంటూ పట్టు పట్టడంతో దర్శకుడిగా మారాడు.


ఆ సినిమా హిట్ కావడంతో రెండో సినిమా చేస్తామని ముందే ప్రకటించిన టీం అదేవిధంగా రెండో సినిమాని కూడా చేసి రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆయన వెంకటేష్ కోసం మరో కథ రాసుకున్నాడని ఆ కథ తీసుకువెళ్లి వెంకటేష్ కి చెబితే ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే హిట్ అనే పరంపరలోనే అనేక సినిమాలు చేస్తానని ఇప్పటికే శైలేష్ కొలను ప్రకటించాడు. దీంతో మూడో సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని కూడా రెండవ సినిమాలోనే క్లారిటీ ఇచ్చారు.


హిట్ మూడో భాగంలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కథ ఒప్పుకున్నాడు సరే అది హిట్ సిరీస్ లో భాగంగా తెరకెక్కే సినిమానా లేక వేరే సినిమానా అనే విషయం మీద క్లారిటీ లేదు. నిజానికి విక్టరీ వెంకటేష్ సినిమాలకు కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకే ఎలాంటి సినిమాలు ఒప్పుకోవడం లేదని కొంత గ్యాప్ తీసుకుని తర్వాతే హీరోగా మళ్లీ సినిమాలు చేయాలని అని అనుకున్నాడని ప్రచారం జరిగింది.


అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం ఇప్పుడు ఆయన ఒప్పుకునే సినిమాల ద్వారానే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగానే శైలేష్ కొలను చెప్పిన కథకు కనెక్ట్ అయ్యి ఆ సినిమా ఒప్పుకున్నాడా ఆయన ఈ సినిమా చేస్తాడా అనేది అధికారిక ప్రకటన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


అయితే శైలేష్ కొలను హిట్టు రెండో భాగంలో విషయంలోనే అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. కేసు అంత బలంగా లేదని హిట్ మొదటి భాగం ఎలాగో నడిచింది కాబట్టి రెండో భాగాన్ని కూడా పైపైన నడిపించినట్లు కనిపించిందని అందరూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే హిట్ సిరీస్కు కొంత గ్యాప్ ఇచ్చి మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడేమో అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Prabhas Wig: ప్రభాస్ ది కూడా విగ్గేనా.. అసలు విషయం ఏంటంటే?


Also Read: Bandla Ganesh Tweet: బండ్లను మోసం చేసిందెవరు? పవన్ పేరు ఎందుకొస్తోంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.