Saindhav Release date: సంక్రాంతి బరిలో వెంకటేష్ `సైంధవ్`
Saindhav Update: సీనియర్ హీరో వెంకటేష్-శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ రిలీజ్ డేట్ ను మార్చుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Saindhav new release date: విక్టరీ వెంకటేష్ నయా మూవీ సైంధవ్. ‘హిట్ సిరీస్’ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇది వెంకటేశ్‌కి 75వ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రిస్మస్ కు అంటే డిసెంబరు 22న రిలీజ్ అవుతుందనుకున్న ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేసింది చిత్రయూనిట్. ఈ మూవీని జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి వెంకటేష్ కు కలిసొచ్చే సీజన్. ఈ పండుగకు రిలీజైన ప్రేమ, చంటి, ధర్మచక్రం, కలిసుందాంరా, సంక్రాంతి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాయి.
సైంధవ్ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. బేబీ సారా, వెంకటేశ్ మధ్య సాగే సన్నివేశాలు మనసుల్ని కట్టిపడేస్తాయని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్.మణికందన్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల దశలో ఉంది. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సలార్ కారణంగానే సైంధవ్ తన రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా వెంకీ యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఓరి దేవుడా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. అంతేకాకుండా రానా నాయుడు వెబ్ సిరీస్ లో కూడా నటించారు.
Also Read: Leo Trailer: పవర్ ప్యాక్డ్ గా విజయ్-లోకేష్ 'లియో' ట్రైలర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి