Salaar Teaser: పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కారణం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు సలార్‌పైనే ఉండటం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తెరకెక్కించాడు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సలార్ సినిమా టీజర్ మరి కొద్దిగంటల్లో విడుదల కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. పూర్తి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సలార్ సినిమా ప్రభాస్‌కు సరిగ్గా సరిపోతుందనేది అంచనా. అందుకే సలార్ సినిమాపై ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సలార్ టీజర్ మరి కొద్దిగంటల్లో అంటే జూలై 6వ తేదీ ఉదయం 5.12 గంటలకు విడుదల కానుంది. 


సలార్ టీజర్ విడుదల టైమింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కేజీఎఫ్‌తో సలార్ సినిమాకు సంబంధం ఉందా అనే అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఎందుకంటే కేజీఎఫ్ 2లో రాకీభాయ్‌పై దాడి జరిగిన సమయం కూడా ఉదయం 5.12 గంటలకే. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ టైమింగ్‌పై రచ్చ చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా సలార్ నిర్మాత దృష్టికి కూడా వెళ్లింది. ఇదంతా మా ముఖాలపై చిరునవ్వును రప్పిస్తోందంటూ పరోక్షంగా ట్వీట్ చేశారు. సలార్ నిర్మాత కార్తీక్ గౌడ్ చేసిన ట్వీట్‌ను బట్టి సలార్ సినిమాకు కేజీఎఫ్‌కు మధ్య లింక్ ఉందనేది దాదాపు నిర్ధారణ అయినట్టే.


ఇప్పుడు అందరి దృష్టీ మరి కొద్దిగంటల్లో విడుదల కానున్న సలార్ టీజర్‌పైనే ఉంది. సలార్ టీజర్ ఎలాంటి సంచలనం రేపుతుందోననే ఆసక్తి ఉత్కంఠ పెరుగుతోంది. సలార్ సినిమా ఎలా ఉంటుందనేది టీజర్‌ని బట్టి అంచనా వేయవచ్చనేది సినీ విశ్లేషకుల మాట.


Also read: Pawan kayan: పవన్ కళ్యాణ్ మూడో భార్యకు విడాకులు నిజమేనా, సింగపూర్‌లో ఉంటున్న లెజినోవా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook