Salaar : ఆశ్చర్యపరుస్తున్న సలార్ ఫ్రీ రిలీజ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్లకు పైగా..
Salaar Pre-release business : ప్రభాస్ హీరోగా కే జి ఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ ఫైనల్ గా డిసెంబర్ లో విడుదల కాదానికి సిద్ధం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
Prabhas Salaar : ప్రస్తుతం ఉన్న హీరోల లో పాన్ ఇండియా పరంగా అత్యంత క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. కాగా బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
సాహో సినిమా హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగువారికి మాత్రం నిరాశన మిగిల్చింది. ఇక ఆ తరువాత వచ్చిన రాదే శ్యామ్ అలానే ఆది పురుష్ రెండు కూడా డిజాస్టర్ లగా మిగిలాయి. కానీ ప్రభాస్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. అందుకే ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుంది అని నమ్మకంతో ఉన్నారు అందరూ. ఇక డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉంది. కాదా ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏమిటి అంటే షారుక్ గత రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అలానే ప్రభాస్ గత రెండు చిత్రాలు దిజాస్టర్లుగా మిగిలినప్పటికీ, షారుక్ సినిమా కన్నా కూడా ప్రభాస్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అందరిని షాప్ కి గురి చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నైజాం రీజియన్‌లో ఈ సినిమా హక్కులను మైత్రీ మూవీస్ 65 కోట్ల ఎన్నారై (నాన్-రిఫండబుల్ అడ్వాన్స్) కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలానే అభిషేక్ రెడ్డి 27 కోట్లకు సలార్ సీడెడ్ హక్కులను కొనుగోలు చేశారు . ఉత్తరాంధ్ర హక్కులు 20.40 కోట్లకు అమ్ముడయ్యాయి . ఈస్ట్ గోదావరి రైట్స్‌కు 13.60 కోట్లు, గుంటూరు, నెల్లూరులో థియేట్రికల్ రైట్స్ 12 కోట్లు, 6.30 కోట్లకు లాక్ అయ్యాయి . పశ్చిమగోదావరి, కృష్ణా ప్రాంతాలకు సంబంధించిన డీల్ ఇంకా లాక్ కాలేదు, అయితే ఈ రెండు ప్రాంతాల నుంచి 19 కోట్ల మొత్తం వస్తుందని భావిస్తున్నారు.
కాగా ఇక్కడ వరకు లెక్కేసిన కానీ సలార్ ప్రీ-రిలీజ్ బిజినెస్ 163.30 కోట్ల కు చేరిపోయింది అన్న విషయం అర్థం అవుతోంది. కేవలం ఆర్ఆర్ఆర్ అలానే బాహుబలి 2 సినిమాలు మాత్రమే అంతకుముందు తెలుగు రాష్ట్రాలలో 160 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలుగా మిగిలాయి. ఇక ఇప్పుడూ సలార్ సినిమా కనీసం హిట్ స్టేటస్ అందుకోవాలి అంటే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం 200 కోట్ల కలెక్షన్ తప్పక సాధించాలి. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా ఇంత కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.
మరి ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఈ మ్యాజిక్ చేసి చూపిస్తారో లేదో తెలియాలి అంటే ఈ క్రిస్మస్ వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Benefits Of Eating Ghee: నెయ్యి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. మీకు తెలియని విషయాలు ఇవే..!
Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook