Salman Khan congratulates Katrina Kaif: భారత సినీ ప్రపంచంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్‌ ఖాన్‌. 56 ఏళ్లు ఉన్నా.. సల్లూ భాయ్ ఎప్పుడూ వివాహం మాట ఎత్తలేదు. అయితే పలువురు హీరోయిన్‌లతో మాత్రం ప్రేమాయణం నడిపాడు. సల్మాన్‌ రిలేషన్‌కు సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. అయితే ఈ వార్తలపై అతడు ఎప్పుడూ స్పందించలేదు. దాంతో సల్లూ భాయ్ సింగల్‌గా ఉన్నారా? లేదా ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? అని అందరూ అనుకుంటుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సల్మాన్‌ ఖాన్‌ తాజాగా తన రిలేషన్‌పై స్పందించారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 15 ఫినాలేలో భాగంగా సల్మాన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. సల్లూ భాయ్..  ప్రస్తుతం ఎవరితోనైనా మీరు రిలేషన్‌లో ఉన్నారా? అని అడగ్గా.. సమాధానం చెప్పుకుండా ఓ నవ్వు నవ్వేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 15కు సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవరించిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్‌ ప్రస్తుతం సమంత లాక్‌వుడ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు. 


అంతకుముందు బిగ్‌బాస్‌ సీజన్‌ 15 ఫినాలో ప్రోగ్రామ్‌లో భాగంగా ఓ బుల్లి తెర నటి కత్రినా కైఫ్‌ నటించిన 'చికినీ చమేలి' పాటకు డ్యాన్స్‌ చేశారు. పాట పూర్తయిన తర్వాత సల్మాన్‌ స్పందిస్తూ.. 'కంగ్రాట్స్‌ కత్రినా. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కత్రినా-విక్కీ కౌశల్‌ వివాహం చేసుకోవడంతో అందరూ సంతోషిస్తున్నారు' అని అన్నారు. అక్కడే మరో నటి మాట్లాడుతూ.. కత్రినా వివాహం విషయంలో మీరు కూడా సంతోషంగా ఉన్నారా?, అయినా మీరు సింగిల్‌గా ఉంటేనే బాగుంటారు అని అన్నారు. 


నటికి సల్మాన్‌ ఖాన్ బదులిస్తూ... 'నిజమే నేను సింగిల్‌గా ఉంటేనే మరింత మెరుగ్గా కనిపిస్తా' అని అన్నారు. ఈ క్రమంలోనే మీరు రిలేషన్‌లో ఉన్నారా? అని అడగ్గా.. నవ్వేశారు. దీంతో సల్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారన్న వార్త నిజమే అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సల్మాన్‌ గతంలో కత్రినాతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షోలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 


Also Read: Anupama Parameswaran: బేబీ బంప్‌తో అనుపమ పరమేశ్వరన్.. షాక్‌లో ఫాన్స్! కంగ్రాట్స్ చెప్పిన కమెడియన్!!


Also Read: Rafael Nadal Prize Money: టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన నాదల్‌కు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook