Salman khan Dengue : మంచాన పడ్డ సల్మాన్ ఖాన్.. కరోనాతో జయం రవి.. ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి ఇదే
Salman khan Suffers From Dengue సల్మాన్ ఖాన్ ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్నాడు.దీంతో ఆయన చేయాల్సిన షూటింగ్‌లన్నీ కూడా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.
Salman khan Dengue - Jayam ravi Covid 19 : సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మంచానపడ్డాడు. డెంగ్యూతో సల్మాన్ ఖాన్ బాధపడుతున్నాడట. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్‌కు పరీక్షలు నిర్వహిస్తే డెంగ్యూ అని తేలిందట. దీంతో వారం రోజులు పాట విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. అలా చివరకు సల్మాన్ ఖాన్ బెడ్ రెస్ట్ తీసుకుంటుండటంతో.. షూటింగ్‌లు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. అసలే ఇప్పుడు సల్మాన్ కిసీ భాయ్ కిసీ కా జాన్, బిగ్ బాస్ పదహారో సీజన్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
అయితే ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా షూటింగ్ ఆపేశారట. బిగ్ బాస్ షోకు సల్మాన్ ఖాన్ రాలేడు కాబట్టి.. కరణ్ జోహర్‌తో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అలా సల్మాన్ ఖాన్ పరిస్థితి ఉంటే.. జయం రవి అయితే కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఈ మేరకు జయం రవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'నిన్న సాయంత్రమే టెస్ట్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం నేను క్వారంటైన్‌కు పరిమితమయ్యాను.. ఈ రెండుమూడు రోజులు నన్ను కలిసిన ప్రతీ ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి' అంటూ జయం రవి ట్వీట్ వేశాడు.
అలా మొత్తానికి ఇప్పుడు మన హీరోలు ఇలా డెంగ్యూ, కరోనాతో బాధపడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఈ మధ్యే గాడ్ ఫాదర్ అంటూ చిరంజీవి పక్కన స్పెషల్ కారెక్టర్‌లో కనిపించాడు. ఇక జయం రవి అయితే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో పవర్ ఫుల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. పొన్నియిన్ సెల్వన్ టైటిల్ రోల్ పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు.
Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook