అభిమానులకు ఈద్ పర్వదినం కానుకగా రేస్-3 సినిమాతో థియేటర్లలోకొస్తున్న సల్మాన్ ఖాన్ అంతకన్నా ముందుగా ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గతంలో హీరో సినిమా కోసం 'మై హూ హీరో తేరా', కిక్ సినిమలో 'హ్యాంగోవర్' వంటి పాటలు పాడి అభిమానులకు తన గొంతు వినిపించిన సల్లూ భాయ్ ఈసారి తనలోని గేయ రచయిత కోణాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు. అవును, రేస్-3 సినిమా కోసం సెల్ఫిష్ అనే పాటను రచించాడు సల్మాన్ ఖాన్. ''ఆవో జీ, మేరా హాత్ థామో జీ మేరే సంగ్ సంగ్ ఛలో ఔర్ వహా బౌఠోనా'' అని మొదలయ్యే ఈ పాటలో సల్మాన్ ఖాన్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లను చూడవచ్చు. విశాల్ మిశ్రా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను గురువారమే ఆ సినిమా మ్యూజిక్ పార్ట్‌నర్ టిప్స్ అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే 2 మిలియన్లకుపైగా వీక్షకులు ఈ పాటను యూట్యూబ్‌లో వీక్షించారు. సల్మాన్ రాసిన ఈ పాటను ప్రముఖ సింగర్ అతీఫ్ అస్లాం, సల్మాన్ ప్రియురాలు లూలియా వాంటుర్ పాటడం మరో విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ గొంతు మాత్రమే విన్న అభిమానులకు ఇప్పుడు అతడి గేయ రచన సాహిత్యాన్ని సైతం ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. మరి సల్మాన్ రాసిన ఈ పాట ఎలా వుందో మీరూ విని చూడండి.  


 


సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో డైసీ షా, సఖీబ్ సలీమ్, ఫ్రెడ్డీ దారువాలా వంటి నటీనటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈద్ కానుకగా జూన్ 15న రేస్-3 రిలీజ్ కానుంది.