Samanta Wished To Naga Chaitanya: ప్రస్తుతం సినీ పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం వార్తలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారు వివాహం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందని కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న రచ్చ వైరల్‌గా మారింది. అయితే నాగ చైతన్య నిశ్చితార్థం వేళ అతడి మాజీ భార్య సమంత పేరు తెరపైకి వస్తోంది. సమంత భవిష్యత్‌ అంటూ చర్చనీయాంశంగా మారింది. వారి ఎంగేజ్‌మెంట్‌పై సమంత ఎలా స్పందిస్తుందా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత స్పందించారు. నిశ్చితార్థం చేసుకున్న జంటకు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ వార్త నిజమా? అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అయితే నాగచైతన్యకు శుభాకాంక్షలు చెప్పిన మాట వాస్తవమే. కానీ చైతూ మాజీ భార్య సమంత కాదు. చైతూ పెళ్లి చేసుకునే శోభిత చెల్లెలు సమంత ధూళిపాల శుభాకాంక్షలు చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Krishna Vamsi: థియేటర్‌లో యువత పెళ్లి.. ఛీ అలా చేయొద్దని 'మురారి' దర్శకుడు వార్నింగ్‌


సినీ నటి శోభిత ధూళిపాలకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సమంత ధూళిపాల. వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. స్నేహితుల్లా కొనసాగుతున్నారు. తాజాగా తన సోదరి నాగ చైతన్యను నిశ్చితార్థం చేసుకోవడంతో వారిద్దరినీ అభిమానిస్తూ సమంత సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. 'To Forever 2022' అంటూ కొన్ని గుర్తులు పెట్టి సందేశం పంపారు. దానర్థం 2022లో ప్రారంభమైన మీ ప్రయాణం జీవితాంతం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు ఉంది.

Also Read: Movies Tree Collapse: 'సినిమాల చెట్టు' కూలింది.. గోదావరి గట్టు బోసిపోయింది


అంతేకాకుండా మా కుటుంబంలోకి స్వాగతం అంటూ నాగచైతన్యకు స్వాగతిస్తూ సమంత సందేశం ఉంది. అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమంత సందేశం పంపిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజలు అనుకుంటున్న సమంత వేరు.. శుభాకాంక్షలు చెప్పిన సమంత వేరని తెలియడంతో చల్లబడుతున్నారు. చైతూ మాజీ భార్య పేరు.. అతడికి కాబోయే మరదలు పేరు ఒకటే కావడంతో అందరూ హీరోయిన్‌ సమంతగా భావిస్తున్నారు. కాగా చైతూ రెండో పెళ్లి విషయంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేస్తున్న రచ్చ చర్చనీయాంశంగా మారింది. అయితే అతడి తీరుపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అవన్నీ పక్కనపెడితే నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య, శోభిత జంట రెండు మూడు నెలల్లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి