Samantha Controversy:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో..మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకటి, రెండు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్న ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఖాళీగా ఉన్న టైం ను మంచికి ఉపయోగించాలి అని భావించిన సమంత ఓ హెల్త్ పాడ్ కాస్ట్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె తన  ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఆమె చేసే ఈ పనిని ఎందరో మెచ్చుకున్నారు. కానీ ఇక్కడే సమంత కొందరి చేతిలో సులభంగా బుక్ అయిపోయింది.


మంచి ఆలోచనతో.. ప్రజలలో ఆరోగ్యం పై అవగాహన కల్పించడం కోసం పాడ్ క్యాస్ట్ ప్రారంభించిన సమంత అనుకోకుండా సోషల్ మీడియాలో క్రిటిసిజం ఎదుర్కొంటోంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై సమంత ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూను విశ్లేషిస్తూ.. ఆమె ఎటువంటి ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది అన్న దాన్ని కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత ఆరోగ్యం బాగుండడం కోసం చక్కెర తక్కువ స్థాయిలో ఉన్న పానీయాలు తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తుంది. అయితే యాడ్స్ లో ఆమె కూల్ డ్రింక్స్.. అదే ఎక్కువ మోతాదులో షుగర్ కంటెంట్ ఉన్న పానీయాలను ప్రమోట్ చేస్తోంది.


అలాగే సమంత ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు అని అడ్వైజ్ ఇస్తుంది . కానీ సమంత కుర్ కురే వంటి ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ను ప్రమోట్ చేసింది. ఇక చాక్లెట్ల విషయానికి వస్తే డార్క్ చాక్లెట్ మంచివి అనే సమంత.. స్వీట్ చాక్లెట్స్ కి బ్రాండ్ అంబాసిడర్. తన వంటలు ఏమో కోకోనట్ ఆయిల్ లో.. కానీ అందరికీ వండుకోమని చెప్పేది మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా సమంత ఆరోగ్యం గురించి చెప్పిన విషయాలకు ఆమె చేసిన యాడ్స్ కు మధ్య పోలికలు పెట్టి వీడియోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. సమంత ఆరోగ్యం కోసం చెప్పేవి.. సమంత యాడ్స్ ద్వారా అమ్మేవి.. అని క్యాప్షన్ లో పెట్టి మరి ఆన్లైన్లో చెడుగుడు ఆడేస్తున్నారు. దీంతో కొందరు ఈ వీడియోలకి స్పందిస్తూ సమంత చెప్పేది ఒకటి ..చేసేది ఒకటి అని కామెంట్లు పెడుతున్నారు.ఇక వీటిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.


 



Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌


Also Read: Fishing Ban: 'ఉప్పెన' సినిమా పునరావృతం.. ఇకపై సముద్రంలో ఆ "పని" నిషేధం



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter