Samantha enjoys Goa vacation With Her Girlfriends, Swimsuit goes viral: టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) నిత్యం వార్తలో ఉంటున్నారు. వ్యక్తిగతం, సినిమా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న సామ్.. టాలీవుడ్, బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తూ దూసుకుపోతున్నారు. మధ్యలో ఐటమ్ సాంగ్స్ (Item Song) కూడా చేస్తున్నారు. దాంతో షూటింగ్ మధ్యలో ఏమాత్రం గ్యాప్ దొరికినా అమ్మడు వెకేషన్‌కు చెక్కేస్తున్నారు. తన స్నేహితురాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 'యశోద' షూటింగ్‌ పూర్తిచేసిన సమంత (Samantha)  వెకేషన్‌ కోసం గోవా (Goa) వెళ్లారు. అక్కడ తన బెస్ట్‌ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. గోవాలోని ఒక బీచ్‌లో సామ్ తమ స్నేహితురాళ్లతో జలకాలాడుతూ కనిపించారు. సింగిల్ పీస్ బికినీలో (Samantha Bikini) అందాలను ఆరబోశారు. నీటిలో థైస్, ఎద అందాలను ఆరబోస్తూ నవ్వులు చిందించారు. సామ్ సహా తన స్నేహితులు కూడా స్విమ్‌సూట్‌లో మెరిశారు. ఇందుకు సంబందించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఫొటోలకు #goayoubeauty అనే ట్యాగ్‌ పెట్టారు. 


Also Read: Breaking News: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కరోనా.. వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చేరిక!!


గోవా వెకేషన్‌ (Goa vacation)కు సంబందించిన సమంత (Samantha) ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సామ్ బికినీ (Samantha Bikini) ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ఫోటోలకు సామ్ అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే సామ్ 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 'ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ' అంటూ రెచ్చిపోయారు. ఈ పాటలో సామ్ డాన్స్ ఇరగదీశారు. ప్రస్తుతం రాజ్‌-డీకే దర్శకత్వంలో సమంత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ యువ నటుడు వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే సామ్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 


Also Read: Children Vaccination: చిన్నారులకు టీకా.. మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం! ఆధార్ లేకుంటే..!!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook