Samantha Beauty Care సినిమా హీరోలు హీరోయిన్స్ పెద్దగా కష్టపడకుండానే కోట్ల పారితోషికం తీసుకుంటారని.. నటించేందుకు డాన్స్ చేసేందుకు కూడా పెద్ద కష్టపడరు అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ చిన్న నటీ నటుల నుంచి మొదలుకుని స్టార్‌ హీరోలు హీరోయిన్స్ వరకు ఒకసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అంటే దక్కిన ఇమేజ్‌ ను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంతే కాకుండా హీరోయిన్స్ హీరోలు తమ ఫిజిక్ ను కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో వారికే తెలుస్తుంది. నచ్చింది తినలేక.. నచ్చినట్లు ఉండలేక స్టార్స్ ఎన్ని కష్టాలు పడుతారో ఇండస్ట్రీలోని వారికే తెలుసు. సెలబ్రెటీ స్టేటస్ దక్కితే దాన్ని కాపాడుకునేందుకు చాలా హోం వర్క్‌ చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా హీరోయిన్స్‌ ఏమాత్రం బరువు పెరిగినా.. ఫేస్ లో గ్లో మిస్ అయినా కూడా అభిమానులు ఊరుకోరు.. అంతే కాకుండా హీరోయిన్స్‌ ఆఫర్ల ఎంపిక విషయంలో ఇంకా స్టార్స్ తో రిలేషన్‌ కొనసాగించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కెరీర్‌ ఆరంభంలోనే కాకుండా కెరీర్ మొత్తంలో ఏ చిన్న తప్పు చేసినా కూడా మొత్తం కెరీర్ నాశనం అవుతుంది. టాలీవుడ్‌ తో తమిళంలో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌ లో కూడా బిజీగా ఉంది. ఇంతగా ఈ అమ్మడు కెరీర్ లో ముందుకు వెళ్తుంది అంటే కారణం ఆమె కష్టం. మగాళ్లను మించి ప్రతి రోజూ గంటల తరబడి సమంత వర్కౌట్స్ చేస్తుంది. అంతే కాకుండా అందం ను కాపాడుకునేందుకు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. 


[[{"fid":"270545","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


తాజాగా సమంత ఈ ఫోటోను షేర్ చేసింది. ఈ మధ్య కాలంలో ఫోన్ ఎక్కువ చూడటం మరియు ఎక్కువగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న కారణంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటం కామన్‌ అయ్యింది. ఆ కళ్ల కింద క్యారీ బ్యాగ్ లను తనకు రాకుండా సమంత ముందస్తుగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. సమంత మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సమంత మాత్రం ఈ ఫొటోను షేర్‌ చేసి తన అందంను కాపాడుకునేందుకు ఎంతగా కష్టపడుతానో చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. 


Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ


సమంత కెరీర్‌ విషయానికి వస్తే శాకుంతలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు నిరాశ పరిచింది. మరో వైపు ఒక హిందీ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సిరీస్‌ లో సమంత బోల్డ్‌ సన్నివేశాల్లో నటించిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సమంత మరో వైపు తెలుగు లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook