Samantha Ruth Prabhu Myositis : సమంతకు స్కిన్ ఎలర్జీ అంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. వాటిని సమంత మేనేజర్ ఖండించాడు. అలాంటిదేమీ లేదని అన్నాడు. కానీ చివరకు సమంత మాత్రం అసలు విషయాన్ని చెప్పింది. యశోద సినిమా విడుదల తేదీ (నవంబర్ 11) దగ్గర పడుతుండటంతో సమంత ఈ విషయాన్ని బయటపెట్టేసింది. యశోద ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో తన ఆరోగ్య పరిస్థితి మీద అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది. తన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూపించింది. తాను ఏ వ్యాధితో బాధపడుతోందో వివరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంతకు వచ్చిన మయోసైటిస్ అనే వ్యాధి చాలా అరుదుగానే వస్తుంది. ఈ వయసు వారికైనా సరే వచ్చే చాన్స్ ఉంటుందట. కండరాల్లోని అసమతుల్యత వల్లే ఇది జరుగుతుందట. దీని వల్ల వాపు వంటివి ఏర్పడుతాయట. దీని వల్ల ఎక్కువగా తొడలు, నడుము, భుజాలు దెబ్బ తింటాయట.  అదే ఒక వేళ ఈ వ్యాధి మరింత తీవ్రంగా మారితే.. చర్మం, ఊపిరితిత్తులు, హృదయం మీద ప్రభావం చూపిస్తుందట. కండరాలు బలహీన పడటం, తీవ్రంగా నొప్పి రావడం, అలసిపోవడం వంటివి జరుగుతుంటాయట.


 



ఇక ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయట.. కండరాలు బలహీన పడటం వల్ల రోజువారీ పనులు కూడా చేసుకోలేరట. మెట్లు ఎక్కడం, దిగడం, జుట్టు దువ్వుకోవడం, కారులోంచి ఎక్కడం దిగడం వంటివి కూడా చేయలేమట. కండరాల్లో తీవ్రంగా నొప్పి వస్తుందట. కండరాలు ఒకదానికొకటి టచ్ అయినట్టుగా ఉంటుందట. కొన్ని సార్లు వాపు కూడా వస్తుందట. తన మొహంలో ఏదైనా వాపు వచ్చిందా? అందుకే మొహాన్ని చూపించలేదా? అని జనాలు అనుకుంటున్నారు.


బరువు తగ్గిపోవడం, రాత్రుల్లో ఎక్కువగా చెమటలు పట్టడం, భుజాలు, హిప్స్, తొడల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుందట. అయితే ఈ మయోసైటిస్‌లోనే చాలా రకాలుగా ఉంటుందట. మరి సమంతకు ఏ రకమైన మయోసైటిస్ వచ్చిందో తెలియడం లేదు. కానీ ఈ మయోసైటిస్ వల్ల మాత్రం రోజువారి పనులు కూడా చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎక్కువ సేపు నిల్చోలేదు, నడవలేదు. ఇలా ప్రతీ చిన్న పని కూడా కష్టంగా మారుతుందట.


మరి సమంత ఇప్పుడు బెడ్డు మీద నుంచి లేచి యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుందో లేదో చూడాలి. డాక్టర్లు అయితే త్వరగా కోలుకుంటుందని చెప్పారట. మరి సమంత తన సినిమా కోసం బయటకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Also Read : Samantha Ruth Prabhu Diseases : ఆస్పత్రి బెడ్డు మీద సమంత.. ఆ వ్యాధితో బాధపడుతోందట.. నోరు విప్పిన సామ్


Also Read : Bigg Boss Galata Geetu : నీది బొచ్చులో ఆట.. శిక్ష పడాల్సిందే.. గీతూ ఇజ్జత్ తీసిన నాగార్జున


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook