Samantha Ruth Prabhu Second Marriage: రెండో పెళ్లికి సిద్దమైన సమంత.. ప్రూఫ్ ఇదే!
Samantha Ruth Prabhu Ready To For Second Marriage Here is the Proof: సమంతా రెండో పెళ్లికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దానికి ప్రూఫ్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.
Samantha Ruth Prabhu Ready To For Second Marriage Here is the Proof: అక్కినేని నాగార్జున మాజీ కోడలు, నాగచైతన్య మాజీ భార్య సమంత రెండో వివాహానికి సిద్ధమైంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏం మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సమంత ఇద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత వారు ప్రేమలో పడలేదు కానీ మంచి స్నేహితులుగా మారారు. చివరికి ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు.
అయితే వీరి వివాహం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య హీరోయిన్, శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చాలా కాలానికి ఆ ప్రచారం సమసిపోయింది కూడా. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని, దీనికి ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమయ్యారని తెలుస్తోంది. సాధారణంగా ఈషా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకలలో సమంత తన స్నేహితులతో కలిసి ప్రతి ఏడాది పాల్గొంటూ ఉంటుంది. ఆమెకు జగ్గీ వాసుదేవ్ తో మంచి పరిచయం ఉంది. సమంత మొదటి పెళ్లి పెటాకులయి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
అయితే కొన్ని రోజుల క్రితం మరో దారుణమైన ప్రచారం కూడా జరిగింది. రెండో పెళ్లి చేసుకోమని సమంత తల్లి ఒత్తిడి పెంచుతూ ఉండడంతో పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా సమంత గర్భసంచి తొలగించుకుందని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సమంత మేనేజర్ తెర మీదకు వచ్చి ఈ పుకార్లన్నీ నిజం కాదని సమంత అనారోగ్యంతో బాధపడుతున్న వార్తలు కూడా నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు సమంత రెండో వివాహం వార్తలు కూడా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ సమంత మేనేజర్ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఈ విషయం నిజమేనేమో అనే ప్రచారం ఊపందుకుంది. ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీన అధికారికంగా విడుదల చేస్తామని ప్రకటించారు. యశోద సినిమా కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత శస్త్ర చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. ఆమె తిరిగి రాగానే యశోద సినిమా తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన డబ్బింగ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: Allu Sirish Movie Release: ఎట్టకేలకు అల్లు శిరీష్ సినిమాకు మోక్షం.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read: The Ghost Pre release event: తండ్రి కోసం తరలి రానున్న తనయులు.. కర్నూల్ ఈవెంట్ కోసం స్పెషల్ ప్లాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook