Samantha South Korea Treatment : సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. లేచి నిల్చో లేని పరిస్థితులో కూడా లేనని తన వ్యాధి లక్షణాల గురించి సమంత తెలిపింది. యశోద ప్రమోషన్స్ కోసం అతి కష్టం మీద ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. అయితే సమంత ఈ వ్యాధితో పోరాడేందుకు చాలానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం సమంత మీద రకరకాల రూమర్లు పుట్టిస్తూనే ఉన్నారు కొంత మంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని, విషమంగా మారిందని, అందుకే దక్షిణ కొరియాకు సమంతను తీసుకెళ్తోన్నట్టుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై సమంత టీం స్పందించింది. ఇవన్నీ పుకార్లేనని ఆమె వ్యక్తిగత టీం కొట్టిపారేసింది. సమంత దక్షిణ కొరియా వెళ్లడం ఏంటని? అసలు ఇలాంటి పుకార్లు ఏ సమాచారం లేకుండా ఎలా పుట్టిస్తారని మండిపడింది. సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉందని, ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా ఉందని క్లారిటీగా టీం చెప్పిందంటూ మీడియాలో మళ్లీ వార్తలు ప్రచారం సాగుతున్నాయి.


మొత్తానికి సమంత ఆరోగ్యం మీద ఇలా రూమర్లు రావడం, టీం ఖండించడం కూడా ఇది వరకు జరిగింది. కానీ చివరకు సమంత తనకు తాను గానే ఇలా మయోసైటిస్‌తో బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటోంది. ఆమె నటించిన శాకుంతలం విడుదలకు రెడీగా ఉండగా.. ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోయింది.

సమంత నటించిన యశోద సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సమంత నటనకు అందరూ ఫిదా అయ్యారు.ఆమె చేసిన యాక్షణ్ సీక్వెన్స్‌కు జనాలు అవాక్కయ్యారు. ఇక యశోద చుట్టూ వివాదాలు కూడా ఎక్కువే అయ్యాయి. ఈవా అని తమ సంస్థ పేరుని వాడారంటూ ఐదు కోట్ల దావా వేసిన కేసు అందరికీ తెలిసిందే. చివరకు దాన్ని నిర్మాతతో కలిసి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. యశోద సినిమాలో ఇకపై ఆ పేరు ఉండదని, తొలగిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు.


Also Read : Vijay Devarakonda Liger : విజయ్‌ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. వాటిపై కూపీ లాగే ప్రయత్నం?


Also Read : Mehreen Pirzada Face : మెహరీన్ మొహానికి ఏమైంది.. ఆ వైద్యాన్ని ఎందుకు ఎంచుకుంది?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook