Samantha Personal Life: తెలుగు చలనచిత్ర  పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సమంత ఒకవైపు సినిమాలు,  మరొకవైపు వెబ్ సిరీస్ లు  నిర్మిస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.  తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె,  అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. నాగచైతన్యను ప్రేమించి,  పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగేళ్ల వైవాహిక బంధం లో సంతోషంగా ఉన్న ఈమె , అనుకోకుండా అతడికి విడాకులు ఇచ్చి వైవాహిక బంధానికి దూరమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత,  మయోసైటిస్ వ్యాధితో కూడా బాధపడింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 


తాజాగా సమంతకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేమిటంటే నటనలోనే కాదు చదువులో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.  సమంత రిపోర్టు కార్డులో మార్కులు చూసి నెటిజన్స్  సైతం ఆశ్చర్యపోతున్నారు.  చెన్నైలోని పల్లవరంలో పుట్టి పెరిగిన ఈమె అక్కడే తన పాఠశాల విద్యను కూడా పూర్తి చేసుకుంది. స్టీఫెన్ మెట్రిక్యులేషన్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివింది. టెన్త్ క్లాస్ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లో 1000 మార్కులకు గానూ 887 మార్కులు సాధించింది. 


 



అందులో అత్యధికంగా మ్యాథ్స్ పేపర్  -1 లో వందకి వంద మార్కులు రాగా , పేపర్ 2 లో 99 మార్కులు వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ మొదటి పేపర్లో 90 మార్కులు,  రెండవ పేపర్లో 74 మార్కులు రాగా,  తమిళంలో మొదటి పేపర్లో 83 మార్కులు , రెండో పేపర్లు 88 మార్కులు సాధించింది. అదేవిధంగా ఫిజిక్స్ లో 95, బోటనీలో 84, హిస్టరీలో 91 , జియోగ్రఫీలో 83 మార్కులు సాధించారు సమంత. ఈ ఫలితాలలో క్లాస్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సమంతను ప్రశంసిస్తూ సమంత ఈ స్కూల్లో చదవడం మా అదృష్టం  అంటూ టీచర్ ఆ రిపోర్టులో పేర్కొనడం విశేషం. ఇకపోతే 2007లో చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో బీకాం పూర్తి చేసి ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చింది.


Also read: Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.