Samantha World tour Pics: ఇటీవల 'ఖుషి' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సమంత.. ప్రస్తుతం వరల్డ్‌ టూర్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. రెండు నెలల కిందట  ఇండోనేషియాలోని బాలికి వెళ్లి అక్కడి ప్రకృతి అందాలను చుట్టేసింది సామ్‌. అక్కడి నుండి అమెరికాకు వెళ్లింది. మళ్లీ ఇప్పుడు ఆస్ట్రియా (Austria) టూర్‌కు వెళ్లి అక్కడ ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఈ టూర్‌కు (Holiday Trip) సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది.  పంచుకుంటోంది. ఈ బ్యూటీ  సైక్లింగ్‌ చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా సామ్ బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్‌’ (Citadel) అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇది త్వరలోనే విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామ్ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay deverakonda)తో కలిసి ఖుషి నినిమా చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌ పై తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషించారు. ఈ మూవీ త్వరలో ఓటీటీకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా అక్టోబరు 01 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 



Also Read: BB 7 Telugu Elimination: నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ లో వారిద్దరూ..!


Also Read: Skanda Movie OTT: 'స్కంద' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి