Samantha Ruthprabhu Emotional Note on Yashoda Movie Success: సమంత హీరోయిన్గా నటించిన యశోద మూవీ సూపర్ హిట్ టాక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. మొదటి రెండు మూడు రోజుల్లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. తర్వాత కొంత వసూళ్లలో డ్రాప్ కనిపించింది.ఇక సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా నేపథ్యంలో సినిమాకు ప్రస్తుతానికైతే కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. అయితే నిర్మాతలు మాత్రం బ్రేక్ ఈవెన్ కావడంతో సేఫ్ గా ఉన్నారు. హరీష్ హరి అని ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో సమంతతో పాటు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో తాజాగా సినిమా యూనిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ కి సమంత హాజరవుతారని భావించినా ఆమె మాత్రం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఒక ఎమోషనల్ థాంక్యూ నోట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.


ఆమె రాసిన ఎమోషనల్ నోట్ను యధాతధంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన ప్రేక్షకులకు సమంత వ్రాయునది, యశోదపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు, మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను, ఇదే నాకు  లభించిన గొప్ప బహుమతని రాసుకొచ్చారు. యశోద సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది, మా 'యశోద' చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశా, సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నా, దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు నా మనసు గాలిలో తేలుతున్నట్టుగా ఉంది,[[{"fid":"252935","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


'యశోద' మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నానని సమంత పేర్కొంది. నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు, దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది, ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారని సమంత పేర్కొన్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పని చేయడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అంటూ సమంత పేర్కొంటూ లేఖ రిలీజ్ చేసింది. 


Also Read: Jayakrishna As Hero: కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. లాంచింగ్ బాధ్యతలు తీసుకున్న మహేష్ బాబు!


Also Read: Samanthas Myositis: సమంత జబ్బుతో నేనూ బాధ పడుతున్నా.. ఆమెకు థర్డ్ స్టేజ్.. కల్పిక సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook