Samantha Ruth Prabhu Interesting comments about Naga Chaitanya: సమంత నాగచైతన్య విడాకులు వ్యవహారం టాలీవుడ్ లో ఒక్కసారిగా కలగలం రేపిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అని తెలుసు కానీ ఎందుకు తీసుకున్నారు అని క్లారిటీ రాకపోవడంతో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే అందులో అధిక భాగం సమంత కారణంగానే విడాకుల వరకు వ్యవహారం వెళ్లిందని ఆమె ప్రవర్తన కారణంగానే నాగచైతన్య విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. దానికి తగ్గట్టు సమంత సుమారు 250 కోట్ల రూపాయల భరణం కూడా తీసుకుందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో సమంత ఈ వ్యవహారాల మీద కోర్టుకు కూడా వెళ్లి తన గురించి అసభ్యకరంగా రాతలు రాస్తున్నారంటూ కేసులు పెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో అందరూ సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత ఈ షోలో తన విడాకుల గురించి తన విడాకుల తర్వాత గడిపిన జీవితాన్ని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ వ్యక్తిగత ప్రశ్నలు అడగను అని అంటూనే అసలు విడాకులు ఎందుకు? తీసుకున్నారు.  ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంటూ ప్రశ్నించారు. అయితే దానికి సమంత స్పందిస్తూ మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదని చెబుతూ విడాకులు తీసుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అని చెప్పుకొచ్చింది.


అంతేకాక విడాకులు తీసుకున్న కొత్తలో బాధపడ్డాను కానీ ఇప్పుడు పర్వాలేదని చెప్పుకొచ్చింది. అప్పట్లో తన జీవితం చాలా దారుణంగా అనిపించిందని ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటపడి మునుపటి కంటే మరింత బలంగా మారిపోయా అంటూ కామెంట్ చేసింది. ఇక 250 కోట్ల రూపాయల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని అయితే ఆ వార్తలు వచ్చిన సమయంలో ఐటీ అధికారులు నాపై రైడ్ చేస్తారేమోనని భయపడ్డానంటూ సమంత సరదాగా కామెంట్ చేసింది.


అయితే నువ్వు నీ భర్త నుంచి విడిపోవాలని ఎందుకు అంటూ కరణ్ అడుగుతుండగా మధ్యలో ఆపేసిన సమంత మాజీ భర్త అంటూ కుండ బద్దలు కొట్టింది. అంతేకాక నాపై వచ్చిన రూమర్స్ పై ఫిర్యాదు చేయలేకపోయానని విడిపోయిన తర్వాత నా వద్ద ఎలాంటి సమాధానాలు లేవని సమంత చెప్పుకొచ్చారు. అంతేకాక ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ప్రశ్నిస్తే మా ఇద్దరినీ ఒక రూమ్ లోకి పంపిస్తే ఆ రూంలో పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలంటూ సమంత కామెంట్ చేసింది. తమ మధ్య ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు లేవు కానీ భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రావచ్చేమో అని సమంత చెప్పుకొచ్చారు.
 Also Read: Thank You Movie Twitter Review: నాగచైతన్య థాంక్యూ సినిమా హిట్టా? ఫట్టా?


Also Read: Thank You Movie: ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook