Samantha Ruth Prabhu interesting comments on Ranveer Singh: ఈ మధ్యకాలంలో సమంత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం ఆమె కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడమే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె షోలో పాల్గొనడమే కాక తన జీవితానికి సంబంధించి కెరియర్ కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది. అంతేకాక పుష్ప సినిమాలో సూపర్ హిట్ గా నిలిచిన పాటకు అక్షయ్ తో కలిసి స్టెప్పులు వేసి కాక రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా ఈ మొత్తం ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా దానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ షోలో రణవీర్ సింగ్ గురించి సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. తనతో పాటు అక్షయ్ కుమార్, రణవీర్ కూడా నటిస్తే ముగ్గురితో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉందని సమంత చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ తాను పూర్తిగా రణవీరిఫై(ranveerfi) అయ్యానని నేను రణవీర్ జీవితానికి అభిమానిని అని చెప్పుకొచ్చింది.


ఇక తన స్నేహితురాలి బ్యాచిలర్ డే పార్టీలో డాన్స్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఒకటి రణవీర్ అలాగే రెండు కూడా రణవీర్ తోనే డాన్స్ చేస్తానని అతని మీద ఉన్న ప్రేమను బయటపెట్టింది సమంత. నిజానికి గతంలో రణవీర్ సింగ్ తో కలిసి సమంత ఒక కమర్షియల్ యాడ్ చేసింది. వారిద్దరికీ ఆ సమయంలోనే మంచి పరిచయం ఏర్పడింది. ఇక తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన అనేక విషయాలను కూడా కాఫీ విత్ కరణ్ షోలో సమంత పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. 


Read Also: Ranveer Singh: ఒంటిపై నూలు పోగులేకుండా రెచ్చిపోయిన రణవీర్ సింగ్.. షాకింగ్ కామెంట్స్!


Read Also: Samantha Ruthprabhu: చైతూ భర్త కాదు మాజీ భర్త.. మా ఇద్దరినీ ఒక రూంలో వదిలితే అవి లేకుండా చూడండి.. సమంత సంచలన వ్యాఖ్యలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.